హైదరాబాద్ : దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చుతూ పలువురు ప్రమాదానికి గురయ్యారు. బాధితులు హైదరాబాద్లోని సరోజినీదేవీ కంటి ఆసుపత్రికి వరుసకట్టారు. మొత్తం 24 మంది గాయపడ్డారని, వారికి చికిత్స అందించినట్లు సరోజినీదేవీ కంటి ఆసుపత్రి వైద్యురాలు వసంత తెలిపారు.
దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చుతూ పలువురు ప్రమాదానికి గురయ్యారు. బాధితులు హైదరాబాద్లోని సరోజినీదేవీ కంటి ఆసుపత్రికి వరుసకట్టారు. మొత్తం 24 మంది గాయపడ్డారని, వారికి చికిత్స అందించినట్లు సరోజినీదేవీ కంటి ఆసుపత్రి వైద్యురాలు వసంత తెలిపారు. 17 మంది బాధితులను సరోజినీదేవీ కంటి ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకున్నట్లు పేర్కొన్నారు.ఇంకా ఎక్కువ కేసులు వచ్చినా వైద్యం అందించేందుకు అన్నివిధాలా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. బాధితుల్లో ఐదుగురికి పరిస్థితి విషమంగా ఉందని, అందులో ముగ్గురిని వేరే ఆసుపత్రికి పంపించామని తెలిపారు. గాయపడిన వారిలో పిల్లలే అధికంగా ఉన్నట్లు వెల్లడించారు.