మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తో కలిసి హాజరైన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి
చంద్రశేఖర్ రెడ్డి
చంద్రశేఖర్ రెడ్డి
నెల్లూరు : నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం సర్వేపల్లిలో క్రిబ్కో గ్రీన్
ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, విశ్వ సముద్ర బయో ఇథనాల్ పరిశ్రమ భూమిపూజ
కార్యక్రమంలో గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తో
కలిసి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
పాల్గొన్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్
జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ గా పరిశ్రమ నిర్మాణానికి శంకస్థాపన చేశారు.
జిల్లాలో రెండు భారీ పరిశ్రమల ఏర్పాటుతో స్థానిక యువతకు పెద్దఎత్తున ఉద్యోగ,
ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలియజేశారు.