సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి
గుంటూరు : గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే సర్వే ఉద్యోగులు గ్రేడ్-3ను
గ్రేడ్-2కి మార్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంగీకరించినట్టు సచివాలయ
ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా
పనిచేస్తున్న 11వేల మంది గ్రేడ్-3 సర్వేయర్లను గ్రేడ్-2లోకి మార్చాలన్న తమ
విన్నపానికి సీఎం ఈ మేరకు సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. తాడేపల్లిలోని
క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను వెంకట్రామిరెడ్డి సహా సర్వే శాఖ అధికారులు
కలిశారు. అనంతరం వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ
ఉద్యోగులకు డీఏ బకాయిలు జనవరిలో ఇచ్చేందుకు సీఎం ఆదేశాలు ఇచ్చారని
వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని బదిలీలకు అనుమతించాలని సీఎంను
మరోసారి కోరినట్టు వెంకట్రామిరెడ్డి తెలిపారు. గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులను
సెప్టెంబర్లోనే బదిలీలు చేస్తామని గతంలో హామీ ఇచ్చినట్లు సీఎంకు
గుర్తుచేశామన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగడం వల్ల గ్రామ
వార్డు సచివాలయ సిబ్బంది బదిలీలు ఆగాయని, ఏప్రిల్లో బదిలీలు చేస్తామని సీఎం
తమకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. గ్రేడ్-3 సర్వేయర్లను గ్రేడ్-2 సర్వేయర్లుగా
మార్చేందుకు సీఎం అంగీకరించడం పట్ల సర్వే డిపార్టుమెంట్ ఉద్యోగుల సంఘం నేతలు
హర్షం వ్యక్తం చేశారు.