న్యూస్ ఏరీనా ఇండియా సర్వే వెల్లడి
మంగళగిరి టూరిస్ట్ లోకేష్
ఎంపీ విజయసాయి రెడ్డి
విజయవాడ : రాష్ట్రంలో జరిపిన అన్ని సర్వేలూ ప్రజల మద్దతు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైఎస్సార్సీపీకే ఉన్నట్లు వెల్లడించాయని, ఈ మేరకు న్యూస్ ఎరీనా ఇండియా సంస్థ నిర్వహించిన సర్వేలో ఏపీలో వైఎస్సార్సీపీదే మళ్లీ అధికారం అని స్పష్టమయ్యిందని నివేదికలో వెల్లడయ్యిందని రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డి అన్నారు. సోషల్ మీడియాలో శనివారం పలు అంశాలు వెల్లడించారు. నివేదికలో 49.4% ఓట్ షేర్ తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 122 సీట్లు కైవసం చేసుకుంటుందని పేర్కొందని అన్నారు. హైదరాబాద్ లో నివసిస్తూ టీడీపీ నేత నారా లోకేష్ మంగళగిరికి టూరిస్ట్ లా వచ్చిపోతున్నాడని, అటువంటి వారు ఇక్కడి ప్రజలకు వద్దని అన్నారు. ఏడాదిలో 365 రోజులూ అందుబాటులో ఉండే స్థానికుడు గంజి చిరంజీవి ప్రజల అవసరాలు తీర్చగలడని, టూరిస్ట్ కావాలో, స్థానికుడు కావాలో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.
విదేశాల్లోని భారతీయ విద్యార్దుల భద్రత బలోపేతం కావాలి
ఇటీవల అమెరికా మరో భారతీయ విద్యార్థి మృతి తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, ఏడాది కాలంలో ఇది నాలుగో సంఘటన అని దీంతో విదేశాలకు ఉన్నత చదువులకై వెళ్లున్న భారతీయ విద్యార్థుల భద్రతపై అనేక సందేహాలు వెల్లువెత్తుతున్నాయని, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి భద్రతా చర్యలు పటిష్టం చేయాలని కోరారు. భారతీయులు చదువుతున్న ఆయా దేశాల ప్రభుత్వాలతో మాట్లాడి విద్యార్థుల భద్రతకు చర్యలు చేపట్టాలని కోరారు. ఏడాదిలో నలుగురు విద్యార్దుల మృతితో దేశవ్యాప్తంగా విదేశాల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని అన్నారు. విద్యార్థుల భద్రత గురించి తక్షణమే ఆయా దేశాలతో చర్చించాల్సిన అవసరం ఉందని అలాగే విదేశాల్లో చదువుతున్న విద్యార్థుల భద్రత దృష్ట్యా మార్గదర్శకాలు ఏర్పాటు చేయాలని విజయసాయి రెడ్డి సూచించారు.