రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతి రాజు రవీంద్ర రాజు
జులై 9న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర ఎన్నికలు
అమరావతి : రాష్ట్రంలో కొంతమంది అధికారుల తీరుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ
రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్ర రాజు తీవ్ర
అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 15 వేలమంది
వీఆర్వోలు పనిచేస్తున్నారు. వీరందరూ వీరికి అప్పజెప్పిన బాధ్యతలు సకాలంలో
నిర్వహిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఒకపక్క ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రిసర్వే
పనులు, ఇతర రోజువారి పనులతో టైం తో సంబంధం లేకుండా,రీ సర్వేకి సంబంధించి సొంత
రూపాయలు ఖర్చు పెడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న, మౌలిక వసతులు
కల్పించకపోయినా, అన్ని పనులు టైం తో సంబంధం లేకుండా చేస్తున్న మా గ్రామ
రెవెన్యూ అధికారులకు సంబంధించి కొంతమంది అధికారులు, వారు చేయవలసిన పనులు
సకాలంలో చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. దీనిలో ముఖ్యంగా
గ్రేడ్2 వీఆర్వోలు యొక్క ప్రొబిషన్ కు సంబంధించి సర్వే ఎగ్జామ్స్ రిజల్ట్స్
వచ్చి 6 నెలలు పూర్తయిన ఇప్పటివరకు అనంతపురం జిల్లాలో గ్రేడ్2 విఆర్ఓ ల
ప్రొబిషన్ డిక్లేర్ ఇప్పటికీ చేయకపోవడం ఆ జిల్లా అధికారుల తీరుకు నిదర్శనం.
అలాగే చాలా జిల్లాల్లో కూడా కొంతమంది అధికారులు ఇబ్బందులకు గురి
చేస్తున్నారని, అలాగే సర్వే ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిన గ్రేడ్2 విఆర్వోలకు
సర్వే సప్లిమెంటరీ ఎగ్జామ్ నిర్వహించాలని, అలాగే గత సంవత్సరం జూలైలో
నిర్వహించిన సర్వే ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిన గ్రేడ్1, విఆర్వో లు, జూనియర్
అసిస్టెంట్ , టైపిస్టులకు సర్వే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఇప్పటిదాకా
నిర్వహించకపోవడం చాలా దారుణం. ఈ విషయాలపై ఎన్నోసార్లు ఉన్నతాధికారులుదృష్టికి
తీసుకెళ్లిన ఫలితం లేక చివరిగా మా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన
ప్రసాదరావు దృష్టికి రాష్ట్ర సచివాలయంలో ఆయన చాంబర్లో రాష్ట్ర అధ్యక్షులు
భూపతి రాజు రవీంద్ర రాజు తీసుకెళ్లి వీఆర్వోలు పడుతున్న ఇబ్బందులను వెంటనే
పరిష్కరించాలని, అలాగే సర్వే సప్లమెంటరీ ఎగ్జామ్స్ అందరికీ వెంటనే
నిర్వహించేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని రెవెన్యూ మంత్రి ని చివరిగా
కోరినట్లు చెప్పారు. ఇప్పటివరకు ఎంతో ఓపికతో సహనంతో ఉన్నాము. వచ్చేనెల
తొమ్మిదో తేదీలోపు గ్రేడ్2 విఆర్వోల ప్రొబిషన్ డిక్లేర్ విషయములో గాని, సర్వే
సప్లమెంటరీ ఎగ్జామ్స్ విషయంలోగాని వెంటనే నిర్ణయం తీసుకోకపోతే జులై 9వ తేదీన
విజయవాడలో మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర
ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆరోజు ఎన్నికల అనంతరం
మారాష్ట్రకమిటీ సమావేశంలో కొంతమంది అధికారులు తీరుపై చర్చించి
రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర అధ్యక్షులు
భూపతిరాజు రవీంద్ర రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలనాయుడు తెలిపారు.