బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తో హీరోయిన్ పూజ హెగ్డే ప్రేమాయణం నడుపుతోందనే
ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. బాలీవుడ్ మీడియా సైతం ఈ అంశానికి ఇటీవల
కాలంలో అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నేపథ్యంలో పూజ హెగ్డే స్పందించింది. తన
గురించి ఇలాంటి వార్తలు రావడం సహజమేనని ఇది కేవలం రూమర్ అంటూ కొట్టి పడేసింది.
ఇలాంటి వార్తలను తాను చదువుతానే కానీ, పెద్దగా పట్టించుకోనని పూజా తెలిపింది.ప్రస్తుతం తాను సింగిల్ గానే ఉన్నానని, తనకు సింగిల్ గా ఉండటమే ఇష్టమని
చెప్పింది. ఇప్పుడు తన దృష్టి సినిమాలపైనే ఉందని తెలిపింది. మరెన్నో సినిమాలలో
నటించాలనేదే తన లక్ష్యమని చెప్పింది. ఇలాంటి ప్రచారాలపై స్పందించే సమయం కూడా
తనకు లేదని తెలిపింది. తన గురించి ఎవరు ఎలాంటి వార్తలను ప్రచారం చేసినా
పట్టించుకోనని చెప్పింది.