వైవిధ్యమైన పాత్రలతో, నాయికా ప్రాధాన్య చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన
కథానాయిక సోనమ్ కపూర్ తెరపై కనిపించి చాలా రోజులైంది. విరామం తర్వాత ఆమె
తెరపై మరో భిన్నమైన పాత్రతో ప్రేక్ష అలరించడానికి ముస్తాబవుతోంది. ఆమె ప్రధాన
పాత్రలో నటించిన చిత్రం ‘బ్లైండ్’. ఈ చిత్రంలో ఆమె జియా అనే అంధురాలైన పోలీసు
పాత్రలో నటిస్తోంది. షోమ్ ముఖీజా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ
సినిమా టీజర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో స్కాట్ లాండ్ లో
తప్పిపోయిన చాలా మంది మహిళలకు సంబంధించిన కేసుకు కచ్చితంగా న్యాయం చేస్తాను.
అంటూ సోనమ్ కపూర్ చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలే ఈ సినిమాను
ఓటీటీ వేదికగా జులై 7న విడుదల చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం . ఒక బ్లైండ్
పోలీసు అధికారి చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతోంది. అంధత్వం కారణంగా అధిగమించలేని
సవాళ్లుని కూడా ఎదుర్కొని విజయం. సాధించవచ్చనే సందేశాన్ని ఈ సినిమాలో
చూపించనున్నారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో పురబ్
కోహిల్, వినయ్ పతాక్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.