మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
పల్నాడు : సహకార సంఘాలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి
గోవర్ధన్ రెడ్డి అన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం, ధూళిపాళ్ల లోని “ఆంధ్ర
బ్యాంక్ రైతు సేవా సహకార సంఘం” స్థాపించి, 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న
సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు , జలవనరుల శాఖా
మంత్రి అంబటి రాంబాబుతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ, సహకార,
మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
పాల్గొన్నారు. ఏ కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ,
శాసనమండలి సభ్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ , జిల్లా కలెక్టర్ శివ శంకర్,
ఆంధ్ర బ్యాంక్ రైతు సేవా సహకార సంఘం పాలకమండలి చైర్మన్ నలబోతు శివ నారాయణ,
పాలకమండలి సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.