వాషింగ్టన్ : నిపుణులు కాని సాధారణ విదేశీ కార్మికులకు అమెరికాలో పని
చేయడానికి మొట్టమొదటిసారి అదనంగా 64,716 తాత్కాలిక వీసాలను మంజూరు
చేయనున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ వీసాలను హెచ్ 2 బి వీసాలంటారు. 2023లో
అమెరికన్ వ్యాపార సంస్థలకు సాధారణ కూలీలను అందుబాటులో ఉంచడానికి ఈ నిర్ణయం
తీసుకున్నారు. అమెరికన్ కార్మికులు చేయడానికి ఇష్టపడని పనులను విదేశీ కూలీలకు
అప్పగిస్తారు. హెచ్2బి వీసాలను విదేశీ కార్మికులు అమెరికాలో పరిమిత కాలంపాటు
వ్యవసాయేతర పనులు, సేవలు అందించడం కోసం ఇస్తారు. సీజనువారీ అవసరాల కోసం, ఒకే
దఫాలో ముగించే పనుల కోసం ఈ వీసాలు పనికొస్తాయి. కార్మికులకు దీర్ఘకాలం గిరాకీ
ఉండే పనులతోపాటు అప్పుడప్పుడూ గిరాకీ ఉండే పనులకు కూడా ఈ తాత్కాలిక వీసాలు
మంజూరు చేస్తారు. ఏడాది పొడవునా విదేశీ వలస కూలీలకు హెచ్ 2 బి వీసాలు
ఇవ్వాలని అమెరికా నిర్ణయించడం ఇదే ప్రథమం. వీటివల్ల భారతీయులకు పెద్దగా
ప్రయోజనం ఉండదని భావిస్తున్నారు. నైపుణ్యాలు గల భారతీయులు హెచ్ 1 బి వీసాల
మీద అమెరికాలో హైటెక్ రంగాల్లో, ఇతర వృత్తుల్లో పనిచేయడానికే ఎక్కువగా
ఇష్టపడతారు.