విజయవాడ : మహిళలు, దళిత, బడుగు, అణగారిన వర్గాల సాధికార సారథి సీఎం వైఎస్
జగన్మోహన్ రెడ్డి అని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే
మల్లాది విష్ణు పేర్కొన్నారు. 29 వ డివిజన్ 209 వ వార్డు సచివాలయ పరిధిలో గడప
గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మంగళవారం సందడిగా సాగింది. వైఎస్సార్ సీపీ
డివిజన్ కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి, అధికారులతో కలిసి మధురానగర్ నేతాజీ
రోడ్డు, కొబ్బరి తోటలో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు. 250 గడపలను
సందర్శించి, ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సంతృప్తిస్థాయి
పెంచేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారని
మల్లాది విష్ణు తెలిపారు. ఎన్నికలలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలుపరుస్తూ..
పేదలందరికీ నవరత్నాల పథకాలను అందజేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా స్థానికుల
నుంచి గ్రీవెన్స్ స్వీకరించారు. నిర్ణీత గడువులోగా వాటన్నింటినీ
పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. అనంతరం పలువురు
అర్జీదారులకు మంజూరైన ఆరోగ్యశ్రీ, పింఛన్ కార్డులను ఎమ్మెల్యే చేతులమీదుగా
అందజేశారు. చంద్రబాబు హయాంలో నియోజకవర్గంలో కేవలం 17 వేల పింఛన్లు మాత్రమే
ఉండేవని, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 25,554 కి పెంచడం జరిగిందన్నారు. ఈ
ఒక్క నెలలోనే 1,074 మందికి నూతన పింఛన్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. గతంతో
పోలిస్తే దాదాపు 10 వేల పింఛన్లు అధికమని తెలియజేశారు.
మధురానగర్ సర్వతోముఖాభివృద్ధికి విశేష కృషి
మధురానగర్ అంతలా అభివృద్ధి చెందిన ప్రాంతం నియోజకవర్గంలోనే మరొకటి లేదని
మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఈ ప్రాంతంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉన్నట్లు
వెల్లడించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉండగా ఈ
ప్రాంతమంతా సిమెంట్ రోడ్లు వేయించినట్లు పేర్కొన్నారు. సీసీ రహదారులు, యూజిడి,
వంతెనల నిర్మాణంతో మధురానగర్ ముఖచిత్రమే మారిపోయిందని తెలియజేశారు. మరలా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి
విశేష కృషి చేస్తున్నట్లు మల్లాది విష్ణు పేర్కొన్నారు. వేసవి నాటికల్లా
రైల్వే అండర్ బ్రిడ్జి పనులను పూర్తిచేస్తామని తెలియజేశారు. అలాగే నేతాజీ
రోడ్డు, కొబ్బరితోట ప్రాంత ప్రజల ఇంటి పట్టాల సమస్యను వీలైనంత త్వరలో
పరిష్కరిస్తామని హామీనిచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, జోనల్
కమిషనర్ జి.సుజనా, నాయకులు ఎస్.కె.బాబు, కోలా రమేష్ ,
కంభం కొండలరావు, సముద్రపు గోవింద్, చీమల గోవింద్, అక్బర్,
శనగశెట్టి హరిబాబు, గుండె సుందర్ పాల్, బెజ్జం రవి, సుధాకర్, పూర్ణిమ, నాగమణి,
రాజేష్, పిల్లి మురళి, మోహన్ రావు, రంగారావు, ఇతర నాయకులు, అన్ని శాఖల
అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.