వారి పాత్రపై విచారణ జరగాలి
అహంకారంతో ప్రజలకిదే చివరి అవకాశం అని బాబు అంటున్నాడు
చంద్రబాబు సైకోలా వీధుల్లోకి వచ్చి విషం చిమ్ముతున్నాడు
బాబు వింత ప్రవర్తన చూసి ప్రజలు ఇదేం ఖర్మ బాబుకి అంటున్నారు
టీడీపీ చిక్కి శల్యమై భూస్థాపితం కావడానికి సిద్ధంగా ఉంది
జయహో బీసీ, రాయలసీమ గర్జనలను పక్కదోవ పట్టించడానికే బాబు తిట్ల పురాణం
బీసీలను జగన్ నుంచి ఏ ఒక్కరూ వేరు చేయలేరు
చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా “జయహో జగనన్న” నినాదం మారుమోగుతుంది
లోకేష్ ఒక రాజకీయ అజ్ఞాని, అక్కుపక్షి
లోకేష్ పప్పుగాడనే చంద్రబాబు పవన్‌కళ్యాణ్ వెంట పడుతున్నాడు
గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్
గుంటూరు : ప్రజల్లో విషాన్ని నింపడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని గృహ
నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. ” నా కోసం కాదు.. మీ కోసమే..మీ
భవిష్యత్తు కోసమే” అంటూ చంద్రబాబునాయుడు అహంకారంతో ప్రజల్ని కోరుతున్నాడు.
నిన్నటి వరకూ మీడియా ముందు కుక్కల్లా మొరిగారు. ఇప్పుడు వీధుల్లోకి వెళ్లి మీ
కోసమే అధికారం అంటూ ప్రజల్ని కాటేసే ప్రయత్నం చేస్తున్నారు. “14 ఏళ్లు
ముఖ్యమంత్రిగా నేను చేశాను. నా పరిపాలనలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవి.
అని చెప్పుకోలేని దుస్థితి చంద్రబాబుది. తన పరిపాలనలో ఈ మంచి పనిచేశాను అని
చెప్పుకోలేక పిచ్చి కుక్కలా వీధిలో పడి కరవడానికి, ప్రజల్లో విషాన్ని
నింపడానికి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు. ఒక సైకోలా ఆయన
ప్రవర్తిస్తున్నాడు. సినిమా స్టైల్లో ఒక జోకర్ లా మైకు పెట్టుకుని వీధుల్లో
హంగామా చేస్తున్నాడు. మూడున్నరేళ్ల పాలనలో మనసున్న ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేస్తున్న మేళ్లను తప్పు పడుతూ సైకోలా
ప్రవర్తిస్తున్నాడు. వింత ప్రవర్తన చూసి ప్రజలంతా చంద్రబాబుకి ఇలాంటి ఖర్మ
పట్టిదేంటని అనుకుంటున్నారని పేర్కొన్నారు.
చంద్రబాబు సైకోలా మారాడు
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి ఐదేళ్లు పరిపాలన చేశారు. ఆ ఐదేళ్లలో
చేసిందేమీ లేక, ప్రజలకు చెప్పుకోలేక చంద్రబాబు సైకోలా మారాడు. అతని మాటలు
చూస్తుంటే తమపై రాజకీయ విష ప్రయోగం చేస్తున్నాడని ప్రజలు తిట్టుకుంటున్నారు.
86 నియోజకవర్గాల్లో టీడీపీకి దిక్కే లేదని వాళ్ళ సర్వే టీమ్‌లే చెప్తుంటే..
చంద్రబాబు రోడ్లెక్కి మాపై నిందలు వేస్తున్నారు.
మంచి చేస్తే 23 సీట్లు ఎందికిస్తారు బాబూ?:
వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ పరిపాలనలో గత 70 ఏళ్లలో ఎన్నడూ లేని సంక్షేమ
పథకాలు అందుతున్నాయి. రూ. 1.76 లక్షల కోట్ల నిధులను రాష్ట్రంలోని అన్నదమ్ములు,
అక్కచెల్లెమ్మల అకౌంట్లలోకి నేరుగా డిబిటి ద్వారా వెళితే చంద్రబాబు వాళ్లని
రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మరో వైపు ఆయన దత్త పుత్రుడు కూడా
చంద్రబాబు ప్రోద్భలంతో ప్రజల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారు. 2014–19 మధ్యలో
మేం పొత్తు పెట్టుకుని గెలిచాం. ఆ తర్వాత విడిపోయాం. మళ్లీ పొత్తులు
పెట్టుకుంటున్నాం, మాకు ఓటేయండి అని అడగాలి. ‘‘చంద్రబాబూ నువ్వేమన్నా ప్రజలకు
మేలు చేశావా..? చేస్తే ప్రజలు నీకు 23 సీట్లతో ఎందుకు చిత్తు చిత్తుగా
ఓడించారు?’’ సమాధానం చెప్పాలి. మొన్నటి ఎన్నికల్లో దత్తపుత్రుడు, బీజేపీతో
కాకుండా ఎర్రజెండాలను భుజానికెత్తుకున్నాడు. తిరిగి ఇప్పుడు బీజేపీతో
వెళ్లాలా? మరెవరితో వెళ్లాలా అని తేల్చుకోలేకపోతున్నాడు. అసలు చంద్రబాబును
ఎవరూ నమ్మరు. ఆయన ఎన్ని జెండాలు పట్టుకుని వెళ్లినా ప్రజలు నమ్మరు. చిక్కి
శల్యమైన, భూస్థాపితానికి రెడీ అయిన టీడీపీకి చంద్రబాబు అధ్యక్షుడు. రేపో మాపో
టీడీపీ పార్టీని పాడెపై మోసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది.
జయహో బీసీ, రాయలసీమ గర్జనలను పక్కదోవ పట్టించడానికే తిట్ల పురాణం..
భారత దేశ చరిత్రలో 82 వేల మంది బీసీలను ప్రజా ప్రతినిధులుగా తీర్చిదిద్దిన
ఒకే ఒక్కడు మా జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకుడు నేతృత్వంలో జయహో బీసీ
అని నినదిస్తూ భారీ సభ నిర్వహిస్తున్నారు. ఈ జయహో బీసీ సభను నీరుగార్చడానికి,
రాయలసీమ గర్జనను పక్కదోవ పట్టించడానికి మా పెద్దలు విజయసాయిరెడ్డి, సజ్జల
గార్లపై ప్రెస్మీట్లు పెట్టి తిట్ల పురాణం అందుకుంటున్నారు. బుద్దా వెంకన్న,
యనమల లాంటి నేతలు మా నాయకులపై ఎన్ని విమర్శలు చేసినా మమ్మల్ని పక్కదోవ
పట్టించలేరు. చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేయించినా జయహో బీసీ, జయహో జగనన్న
అనే నినాదాలు రాష్ట్రమంతా మారుమోగుతోంది. 75 ఏళ్ల భారత దేశ చరిత్రలో ఎవరూ
చేయలేని సామాజిక విప్లవాన్ని, జ్యోతిరావు పూలే ఆశయాలను నిజం చేసి చూపించిన మా
నాయకుడు శ్రీ వైఎస్ జగన్ వెంట బీసీలంతా అడుగులో అడుగు వేస్తున్నారు.
లోకేష్ రాజకీయ అజ్ఞాని, అక్కుపక్షి
లోకేష్ ఒక రాజకీయ అజ్ఞాని, అక్కుపక్షి. అందుకే చంద్రబాబు చూపు పక్కదారి
పట్టింది. పరదాలు కట్టారంటూ లోకేష్ అజ్ఞానంతో ట్వీట్ లు చేశాడు. ఈ రోజు
రాష్ట్రానికి వచ్చింది దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ని కూడా
ఆ ఆజ్ఞానికి తెలియడం లేదు. ఆమె రక్షణ కోసం, ఆమెను స్వాగతించడం కోసం చేసిన
ఏర్పాట్లను జగన్ కోసం అన్నట్లు ట్వీట్ చేసిన అక్కుపక్షి లోకేష్.
దొడ్డిదారిన మీ నాన్న పుణ్యమా అని ఎమ్మెల్సీ అయ్యావు. దొడ్డిదారిన మంత్రి
అయ్యావు. జీవితంలో ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో అడుగుపెట్టగలవా లోకేష్..?
లోకేష్ పనికిరాడు. శుద్ధ మొద్దు, పప్పుగాడనే చంద్రబాబు పవన్‌కళ్యాణ్ వెంట
పడుతున్నాడు.
చంద్రబాబు బీసీలను అడుగడుగునా అవమానించాడు:
చంద్రబాబు లాంటి వాళ్లు ఎంత మంది ఎంత నీచంగా మాట్లాడినా బీసీలు తలెత్తుకుని
తిరిగేలా, అన్ని రంగాల్లో వారు ముందడుగు వేసే కార్యక్రమాలు చేసిన జగన్మోహన్
రెడ్డి నాయకత్వాన్నే బీసీలు కోరుకుంటారు. తన హయాంలో చంద్రబాబు ప్రజల్ని,
బీసీలను కాటు వేస్తూనే ఉన్నాడు. బీసీలను చంద్రబాబు అడుగడుగునా అవమానించాడు.
నేడు బీసీలంతా తమకు సామాజిక న్యాయం దక్కిందని జగన్ వెంట నడుస్తున్నారు.
బీసీలను జగన్‌తో వేరు చేయలేరు. బీసీలంతా జగన్ వెంటే నడుస్తారు.
బీసీలు జయహో జగన్ అంటూ సంకేతం ఇస్తున్నారు…
జయహో బీసీ అంటే కాపీ కొట్టడమా..? కాపీ కొట్టాల్సిన అవసరం ఏముంది…? బీసీలంతా
జయహో అంటూ ఒక సంకేతం ఇస్తున్నారు. ఎప్పుడైనా చంద్రబాబు హయాంలో సామాజిక న్యాయం
జరిగిందా… అసలు చంద్రబాబుకి సామాజిక న్యాయం అంటే అర్ధం తెలుసా? అని
ప్రశ్నిస్తున్నా.
స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో బాబు, లోకేష్ పాత్ర
స్కిల్ డెవలప్మెంట్లో అది ఒక భారీ స్కాం. సుమారు రూ. 241 కోట్లు
దారిమళ్ళిందని ఈడీ నోటీసులు ఇచ్చింది. దీని వెనుక చంద్రబాబు, ఆయన కొడుకు
లోకేష్‌ల పాత్ర తప్పకుండా ఉంటుంది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన
కుమారుడు లోకేష్‌లకు తెలియకుండా ఇంత పెద్ద స్కాం జరగే అవకాశమే లేదు. మాకు
నోటీసులు రాలేదని సంబరపడొద్దు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరగాలని మేం కూడా
కోరుకుంటున్నామని మంత్రి జోగి రమేష్ అన్నారు.