ఓయూ ఆర్ట్స్ కాలేజీలో ” ఎమర్జింగ్ చాలెంజెస్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ” సెమినార్
హైదరాబాద్ : సామాజిక పరిస్థితి పరిస్థితులకు అనుగుణంగా పాఠ్యప్రణాళిక ఉండాలని
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
అభిప్రాయపడ్డారు. శనివారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ” ఎమర్జింగ్
చాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ ” అనే అంశంపై జరిగిన సెమినార్ లో వినోద్ కుమార్
ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ సమకాలీన
పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే పాఠ్య
ప్రణాళిక ఉండాలని అన్నారు. విద్యాభ్యాసంతో పాటు సామాజిక అంశాలపై విద్యార్థులు
దృష్టిని సావించాలని వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. విశ్వవిద్యాలయాలలో రిసర్చ్
పై అధ్యాపకులు, విద్యార్థులు ప్రత్యేక దృష్టిని సాగించాలని వినోద్ కుమార్
సూచించారు.
రీసెర్చ్ పై యూనివర్సిటీలను ఆయా ప్రభుత్వాలు ప్రోత్సహించాలని ఆయన
అభిప్రాయపడ్డారు. అన్ని స్థాయిల విద్యాలయాలలో అకాడమిక్ ఫ్యాకల్టీ
పూర్తిస్థాయిలో ఉండాలని, బోధన సిబ్బంది తమ నైపుణ్యాన్ని మెరుగు పరుచుకునేందుకు
నిరంతరంగా తమకు తాము పునశ్చరణ కార్యక్రమంపై దృష్టి సారించాలని వినోద్ కుమార్
సూచించారు. ఈ రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలలో అధ్యాపకుల కార్యలపర్తి కోసం
కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల
అసెంబ్లీలో బిల్లు ఆమోదించి గవర్నర్ కార్యాలయం పంపారని త్వరలోనే ఈ ఫైల్ ను
గవర్నర్ క్లియర్ చేస్తారని వినోద్ కుమార్ పడ్డారు. గవర్నర్ ఈ ఫైల్ ను క్లియర్
చేయగానే అధ్యాపకులు ఖాళీగా ప్రక్రియ ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఈ సెమినార్
లో ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ డి రవీందర్ యాదవ్, వీసీ
ఓ ఎస్ డి ప్రొఫెసర్ రెడ్యానాయక్, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చింతా
గణేష్, తదితరులు పాల్గొన్నారు.