నిజామాబాద్ : బీజేపీ , కాంగ్రెస్ నాయకులు సామాజిక మాధ్యమాల్లో కేసీఆర్
పాలనపై చెబుతున్న అబద్ధాలను అదే వేదిక ద్వారా తిప్పికొట్టాలని ఎమ్మెల్సీ
కల్వకుంట్ల కవిత భారాస కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నిజామాబాద్‌లో
నిర్వహించిన భారాస కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరై
మాట్లాడారు. ‘మన కార్యకర్తలు నిజాలు తెలియజేసి ప్రజలను చైతన్యవంతులను చేయాలి.
ఇందుకు సామాజిక మాధ్యమం వేదిక కావాలి’ అని పిలుపునిచ్చారు. విపక్షాలు నిజాలు
చెబితే గౌరవిస్తామని, అసత్యాలు ప్రచారం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని
హెచ్చరించారు. కాషాయం కండువాలు కప్పుకొనే బీజేపీ నేతలు జై జవాన్…జై
కిసాన్ నినాదాలు చేస్తారే తప్పిస్తే వారిని ఆదుకున్న దాఖలాలు లేవన్నారు.
జవాన్లను, రైతులను ఆదుకున్న కేసీఆరే నిజమైన దేశ భక్తుడని కొనియాడారు. రాష్ట్ర
అభ్యున్నతికి ఏం చేయాలో నిరంతరం ఆలోచిస్తూనే ఉంటారని చెప్పారు. ఎవరెస్టు
శిఖరంలాంటి వ్యక్తి మనకు అండగా ఉన్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, రాష్ట్ర మహిళా ఆర్థిక
సహకార సంస్థ ఛైర్పర్సన్ లలిత, నిజామాబాద్ మేయర్ నీతూ కిరణ్ పాల్గొన్నారు.