రాంబాబు
సత్తెనపల్లి : దేశంలోని అణగారిన వర్గాల ఆర్ధిక, సామాజిక సాధికారికతకు
అంబేడ్కర్ చివరి వరకూ పోరాటం చేశారని, ఆ మహనీయుని ఆశయాల సాధనే ఘనమైన నివాళి
అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మంగళవారం బాబాసాహెబ్
అంబేద్కర్ 66వ వర్ధంతిని పురస్కరించుకొని నియోజకవర్గ కార్యాలయంలో అంబెడ్కర్
చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ
రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ ఇతర ముఖ్య నాయకులు ఉన్నారు. ఈ
సందర్భంగా అంబటి మాట్లాడుతూ రాజ్యాంగ పరిషత్తు సభ్యునిగా అంబేడ్కర్ విశేష
శ్రమకోర్చి రాజ్యాంగ రచన చేయడం ఆయన శేష జీవితంలో ప్రముఖమైన ఘట్టమన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయ ల రాజనారాయణ
మాట్లాడుతూ బాల్యంలోనే అడుగడుగునా బాధలకు, అవమానాలకు గురియై, బీదరికాన్ని
ఎదుర్కొంటూ స్వయంకృషితో, స్వీయప్రతిభతో స్వతంత్ర భారతదేశంలో కేంద్రమంత్రి
పదవిని అలంకరించిన మహామనీషి బాబాసాహెబ్ అంబేద్కరన్నారు. మున్సిపల్ నాయకులు
చల్లంచర్ల సాంబశివరావు, వైస్ చైర్మన్ నాగూర్ మీరాన్, కోటేశ్వరావు నాయక్,
నకరికల్లు మండల కన్వీనర్ భవనం రాఘవరెడ్డి, ముప్పాళ్ళ నాయకులు ఏంజేఆర్
లింగారెడ్డి, అచ్యుత శివ ప్రసాద్ ,మక్కెన అచ్చయ్య, కోడిరెక్క దేవదాసు, రవి
రాజా, పెండం బాబురావు, జైపాల్, వెలుగూరి శరత్ తదితరులు పాల్గొన్నారు.