సైదాపురం : వెంకటగిరి నియోజకవర్గంలో వైసీపీ నిర్వహించిన సామాజిక సాధికార బస్సుయాత్రకు సైదాపురం మండలం నుంచి వేలాదిగా వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు తరలివెళ్లారు. సైదాపురం మండల వైసీపీ కన్వీనర్ రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మండలం నుండి దాదాపు రెండు వేల మంది నాయకులు, కార్యకర్తలు,అభిమానుకు రాపూరుకు ప్రత్యేక వాహనాల్లో బయలు దేరారు. ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో పట్టించుకోలేదన్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం మేనిఫెస్టో లో ప్రకటించిన హామీలన్నీ అమలు చేసి ప్రతి ఒక్కరికీ పథకాలు అందేవిధంగా పాలన సాగిస్తోందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభివృద్ధి సీఎం జగన్ హయాంలోనే జరిగిందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని సీఎం నెరవేర్చారన్నారు. సామాజిక సాధికారతను సీఎం జగన్ చేతల్లో అమలు చేసి చూపించారని, రాష్ట్రంలో సామాజిక విప్లవం నడుస్తోందని మంత్రి అన్నారు. 2024లో జగన్ రెండోసారి ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఉంది. అంబేద్కర్ స్ఫూర్తితో నడుస్తున్న ఏకైక నాయకుడు సీఎం జగన్. అభివృద్ధి చదువు ద్వారానే సాధ్యమవుతుందన్న అంబేద్కర్ ఆలోచనలను ఆచరణలో పెట్టిన నాయకుడు. బీసీ, ఎస్సీ ఎస్టీల మైనార్టీల ఆత్మ గౌరవాన్ని గుర్తించిన వ్యక్తి జగన్’’ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలొ వ్యవసాయ సంఘం అధ్యక్షులు శివకుమార్,ఎంపిటిసి వెంకటరమణ , ఉప సర్పంచ్ శివకుమార్ నాయకులు సుధీర్,రమేష్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు