బాలాయపల్లి :-
ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సాయం చేసే గుణం ఉంది కాబట్టే నేడు కొత్త పింఛన్లు మంజూరు చేయడం జరిగిందని తిరుపతి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం బాలయ్య పల్లి మండలంలో 84 కొత్త పింఛన్లు మంజూరు అయిన పింఛన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఏ అవసరములో ఉన్నారో వాటిల్ని గుర్తించి వెంటనే సంక్షేమ పథకాలు లాగా అందించడం జరుగు తుందన్నారు. అంతేకాకుండా సంక్షేమ పథకాలు అందించేందుకు అధికారులు శక్తివంతులు లేకుండా కృషి చేయాలి అన్నారు. అనంతరం ఎంపీడీవో ఆధ్వర్యంలో కొత్త పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ వెందోటి కార్తీక్ రెడ్డి, ఎంపీడీవో ప్రమీల రాణి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో:- పింఛన్లు పంపిణీ చేస్తున్న నేదురుమల్లి