హైదరాబాద్ : రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్, తెలంగాణ ఉద్యమ గాయకుడు
సాయిచందర్ హఠాన్మరణంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
చిన్న వయసులో ఆయన మరణం కలచివేసిందన్నారు. సాయిచంద్ మరణంపై సంతాపం
వ్యక్తంచేసిన సీఎం ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘‘రాష్ట్ర
సాధన, సాంస్కృతిక ఉద్యమంలో సాయిచంద్ పాత్ర అజరామరం. గొప్ప గాయకుడు,
కళాకారుడిని కోల్పోయాం’’ అని కేసీఆర్ అన్నారు. సాయిచంద్ మృతిపై మంత్రి
కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణం విచారకరమని
చెప్పారు. భారాసకు సాయిచంద్ ఎనలేని సేవ చేశారని, ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని
భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.