క్యాంపు కార్యాలయంలో పలువురు అధికారులు తదితరులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
డా.కెఎస్.జవహర్ రెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
శుభాకాంక్షలు తెలిపిన వారిలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య
కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, ప్రణాళికా శాఖ కార్యదర్శి జి ఎస్.ఆర్.కె.ఆర్
విజయకుమార్, ఎపి నైపుణ్య శిక్షణా సంస్థ ఎండి ఎస్. సత్యనారాయణ, బిసి సంక్షేమ
శాఖ కమిషనర్ అర్జునరావు, సిఆర్డిఏ కమీషనర్ వివేక్ యాదవ్, అదనపు కమిషనర్
కె.సింహాచలం,మైనార్టీ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ జిసి కిషోర్ కుమార్,
ఎస్ఐఆర్డి డైరెక్టర్ జె.మురళి, పశు సంవర్ధక శాఖ సంచాలకులు అమరేంద్ర
కుమార్,ఎన్టిఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, గుంటూరు జిల్లా కలెక్టర్
ఎం.వేణు గోపాల రెడ్డి, గుంటూరు జెసి రాజకుమారి, గుంటూరు మున్సిపల్ కమిషనర్
కీర్తి, సిఎస్ కార్యాలయ అధికారులు, సిబ్బంది, ఇతర శాఖల అధికారులు తదితరులు
సిఎస్ డా.కెఎస్.జవహర్ రెడ్డికి పుష్ప గుచ్చాలు అందించి నూతన సంవత్సర
శుభాకాంక్షలు తెలియజేశారు.టిటిడి దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానాల వేదపండితుల ఆశీర్వచనం
సిఎస్ జవహర్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం, దుర్గా మల్లేశ్వర స్వామి
దేవస్థానాల వేద పండితులు ఆశీర్వచనం అందించారు. దుర్గా దేవస్థానం ఇఓ భ్రమరాంబ
ఆధ్వర్యంలో పలువురు వేద పండితులు సిఎస్ కు వేద ఆశీర్వచనం అందించారు.
ఎపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్,ఎపి కోఆపరేటివ్ సర్వీసెస్ అసోసియేషన్ల
డైరీ,కేలండర్ల ఆవిష్కరణ
సిఎస్ డా.కెఎస్.జవహర్ రెడ్డి ఎపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, ఎపి
కోఆపరేటివ్ సర్వీసెస్ అసోసియేషన్ల డైరీలు, కేలండర్లను ఆవిష్కరించారు.
ఈకార్యక్రమంలో ఎపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు
వెంకటేశ్వర్లు, ఆయా అసోసియేషన్ల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నున్న
మానసిక వికలాంగుల కేంద్రానికి చెందిన పలువురు చిన్నారులకు సిఎస్.డా. జవహర్
రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి వారికి మిఠాయిలు పంపిణీ చేశారు.