సీజేరియన్ అనేది ఒక మేజర్ సర్జరీ. సిజేరియన్ తర్వాత అనేక జాగ్రత్తలు
తీసుకోవాలి.
1) నెయ్యి:
సిజేరియన్ తర్వాత నెయ్యి పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా అన్నంలో నెయ్యి
కలుపుకొని తినకూడదు. నెయ్యి తీసుకోవడంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.
అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
2) స్పైసీ ఫుడ్:
సిజేరియన్ సర్జరీ అయిన తర్వాత బాలింతలు స్పైసీ ఫుడ్ తినకూడదు. స్పైసీ ఫుడ్
అనేక జీర్ణ సమస్యలను కారణం అవుతుంది. ఇది కోత ప్రాంతంలో నొప్పిని పెంచుతుంది.
3) కూల్ డ్రింక్స్:
సిజేరియన్ అయిన మహిళలు కార్బోనేటేడ్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలి. సి-సెక్షన్
తర్వాత కార్బోనేటేడ్ పానీయాలు తీసుకోవడంతో డీహైడ్రేట్ అవుతారు. ఇది పాల
ఉత్పత్తిపై చెడు ప్రభావం చూపుతుంది.
4) పనస:
సీ సెక్షన్ సర్జరీ చేయించుకున్న మహిళలు పనస పండుకు దూరంగా ఉండాలి. జాక్ ఫ్రూట్
తినడంతో గుండెల్లో మంట, వివిధ జీర్ణ సమస్యలు వస్తాయి. కోత ప్రాంతంలో నొప్పి
కూడా పెరుగుతుంది.
5) బీన్స్:
బీన్స్, పచ్చి బఠానీలు, మినప పప్పు వంటి పదార్థాలకు సిజేరియన్ తర్వాత దూరంగా
ఉండాలి. ఇవి గ్యాస్ట్రిక్ సమస్యలకు కారణం అవుతాయి. దీంతో ప్రేగు కదలికల్లో
ఇబ్బందులు ఏర్పడి నొప్పి తీవ్రమవుతుంది.
6) జంక్ ఫుడ్:
సాధారణంగా జంక్ ఫుడ్ తినడం ఆరోగ్యానికి హానికరం. సి-సెక్షన్ సర్జరీ తర్వాత
ఫాస్ట్ ఫుడ్ తినడంతో బరువు పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో తలనొప్పి,
దద్దుర్లు సమస్య తీవ్రం అవుతుంది.
7) చల్లని పదార్థాలు:
సి-సెక్షన్ సర్జరీ తర్వాత చల్లగా ఉన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. చల్లని
ఆహారం రక్తప్రసరణ వ్యవస్థలో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. దీంతో
ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.
8)పచ్చి ఆహారం
డెలివరీ తర్వాత, ముఖ్యంగా సి-సెక్షన్ సర్జరీ అయిన తర్వాత పచ్చి మాంసం, పచ్చి
గుడ్లు తినకూడదు. ఇవి అనేక ఇన్ఫెక్షన్లకు కారణం అవుతాయి.