సినీ ప్రముఖుల నడుమ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ వివాహం
బాలీవుడ్ సినీ రంగంలో లవ్ బర్డ్స్ సిద్ధార్థ్ మల్హోత్రా, హీరోయిన్ కియారా
అద్వానీ ఎట్టకేలకు ఒక్కటయ్యారు. కుటుంబసభ్యులతో పాటు అతికొద్ది మంది
సన్నిహితులు, సినీ ప్రముఖుల మధ్య వీరి వివాహం వైభవంగా జరిగింది. షేర్షా
సినిమాతో అకట్టుకున్న ఈ బ్యూటీఫుల్ జోడీ.. ఇప్పుడు నిజజీవితంలో దంపతులుగా
మారారు. వీరి పెళ్లికి రాజస్థాన్ లోని జైసల్మేర్ సూర్యగఢ్ ప్యాలెస్ వేదిక
అయ్యింది. గత మూడు నాలుగు రోజులుగా వీరి పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. వీరి
వివాహానికి బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. అంతేకాదు.. అతిథులను రిసీవ్
చేసుకోవడం కోసం ఏకంగా 70 లగ్జరీ కార్లను నిరవాహకులు ఏర్పాటు చేశారు.
అంతేకాకుండా.. సిద్ధార్థ్, కియారా పెళ్లికి రోజుకు దాదాపు రూ. 2 కోట్లు
ఖర్చయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన ఖరీదైన పెళ్లి వేడుకల్లో వీరిది
ఒకటి. ఎట్టకేలకు ఫిబ్రవరి 7న ఈ ప్రేమపక్షులు ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు.
అయితే వీరి పెళ్లికి వచ్చే అతిథులకు ఫోన్ ఉపయోగించేందుకు అనుమతి లేదని సమాచారం.
పెళ్లి కోసం కియారా అద్వానీ పింక్ లెహంగా ధరించింది. దీనిని మనీష్
మల్హోత్రా డిజైన్ చేసినట్లు పుకార్లు ఉన్నాయి. ఆమెకు అనుబంధంగా సిద్ధార్థ్
దంతపు షేర్వాణిని ధరించాడు. వారు తమ మొదటి అధికారిక వివాహ ఫోటోలను వారి చిత్రం
షేర్షా నుంచి ఒక లైన్‌తో పంచుకున్నారు: “అబ్ హుమారీ పర్మనెంట్ బుకింగ్ హోగయీ
హై.” మా ముందున్న ప్రయాణంలో మేము మీ ఆశీర్వాదాలు, ప్రేమను కోరుకుంటున్నాము.”
జైసల్మేర్‌లోని వివాహ వేదిక వెలుపల ఉన్న మీడియాకు వీరిద్దరూ ఇంకా
పోజులివ్వలేదు.