హైదరాబాద్ : సినీ గగన నీలాకాశంలో ఆయన సూపర్ స్టార్ అని రాష్ట్ర విద్యుత్ శాఖా
మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభివర్ణించారు. సినీ నటుడు కృష్ణ మృతి పట్ల
ఆయన సంతాపం ప్రకటించారు. సినీ జగత్తులో సంచలనాలకు కేంద్రబిందువుగా నిలిచిన
కృష్ణ డేరింగ్, డాషింగ్ అనన్య సామాన్య మైనదని ఆయన కొనియాడారు. అటువంటి హీరో
నేడు మన మధ్య లేక పోవడం తీరని లోటుగా ఆయన చెప్పారు. సినిమా ను స్కోప్ లో
తీయలన్నా 70 యం యం స్టీరియోస్కోపిక్ తో తియ్యలన్నా ఆయనకే చెల్లు బాటు
అయిందన్నారు. మొట్టమొదటి ఈస్ట్ మాన్ కలర్ సినిమాతో సినీ ప్రపంచంలో సంచలనాలు
మొదలు పెట్టిన ఆయన స్కోప్, స్టీరియోస్కోపిక్,70 యం యం వంటి అరుదైన రికార్డులు
సొంతం చేసుకున్న నటశేఖరుడు సినీ పరిశ్రమ కు ఒక వేగు చుక్క లాంటి వారన్నారు.
జేమ్స్ బాండ్ తో రాణించి అల్లూరి సీతారామ రాజు డైలాగులతో తెలుగు సినీ
ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న కృష్ణ కొత్త కాపురం వంటి కుటుంబ
కథా చిత్రాలలో నటించి మహిళాభిననుల మనసులో చిరస్మరణీయంగా నిలిచి పోయారన్నారు.
అటువంటి మహా నటుడి మరణం తెలుగు సినీ పరిశ్రమకు ఎప్పటికీ లోటుగానే
ఉంటుందన్నారు. అటువంటి మహానటుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు ఆయన
తెలిపారు.