బాలీవుడ్ అగ్రకథానాయిక అలియాభట్ ఇప్పుడు హాలీవుడ్ లోనూ మెరిపించడానికి
సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఆమె హాలీవుడ్ లో ‘హార్ట్ ఆఫ్ స్టోన్ చిత్రంలో
కీలక పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రంలో కియాధావన్ అనే ప్రతినాయక ఛాయలున్న
పాత్రలో కనిపించనుంది ఆలియా. ఈ చిత్రం ప్రకటించినప్పటి నుంచి ఆమె అభిమానులు
ఆసక్తితో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె
బాలీవుడ్ కి హాలీవుడ్ కి మధ్య ఉన్న తేడా గురించి ఆసక్తికర విషయాలను
పంచుకుంది. ఆర్ఆర్ఆర్, బ్రహ్మాస్త్ర లాంటి సినిమాలలో నటించారు. ఇప్పుడు
హాలీవుడ్ చిత్రం ‘హార్ట్ ఆఫ్ స్టోన్లో నటిస్తున్నారు. దీనికి దానికి మధ్య తేడా
ఏమైనా కనిపించిందా? అని అడిగిన ప్రశ్నకు ఆలియా. బదులిస్తూ ‘నిజంగా ఎలాంటి తేడా
లేదు. నాకు తెలిసి ప్రపంచమంతా సినిమా ఒకే విధంగా ఉంటుందని అనుకుంటున్నాను.
అదే వ్యక్తులు, అదే దృష్టి, వారి ఆలోచన విధానం కూడా అంతా ఒక్కటే. కానీ, భాష
ఒక్కటి మాత్రం భిన్నంగా ఉంటుంది. అదే విధంగా వారు కథలు చెప్పే విధానం కూడా
వేరుగా ఉంటుంది. కానీ ముఖ్యంగా మనం మంచి భావోద్వేగాల కోసం పనిచేయాలి. ఎందుకంటే
చివరికి అదే ప్రేక్షకులను కనెక్ట్ చేస్తుంది’ అని చెప్పుకొచ్చింది.