న్యూఢిల్లీ : ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా అరెస్టును దుష్ట
రాజకీయంగా సీఎం కేజ్రీవాల్ అభివర్ణించారు. ఈ చర్యతో ప్రజలు ఆగ్రహంతో
ఉన్నారని.. తగిన రీతిలో స్పందిస్తారంటూ ట్వీట్ చేశారు. మద్యం కుంభకోణం
కేసులో దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియాను సీబీఐ అధికారులు అరెస్టు
చేయడంపై ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అర్వింద్
కేజ్రీవాల్స్పందించారు. ‘‘మనీశ్ సిసోదియా అమాయకుడు. ఆయన్ను అరెస్టు చేయడం
దుష్ట రాజకీయం. ఈ అరెస్టుతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
అందరూ గమనిస్తున్నారు. ప్రజలు అన్నీ అర్థం చేసుకుంటున్నారు. దీనిపై ప్రజలే
స్పందిస్తారని ట్వీట్ చేశారు. ఇలాంటి చర్యలు తమలో ఉత్సాహాన్ని పెంచడంతో పాటు
పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తాయని అన్నారు. కేజ్రీవాల్, సిసోదియా ఎదుగుదల
చూసి బీజేపీ భయపడుతోందని ఆప్ ఎమ్మెల్యే అతిషీ అన్నారు. ఆప్‌కు పెరుగుతోన్న
ప్రజాదరణే ఈ అరెస్టుకు అసలు కారణమని పేర్కొన్నారు. ఆప్‌ను అంతం చేయాలని భాజపా
ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. సిసోదియా అరెస్టును నకిలీదిగా పేర్కొన్నారు.
మరోవైపు, మనీశ్ సిసోదియా అరెస్టు నియంతృత్వానికి పరాకాష్ఠగా ఆప్ ఎంపీ సంజయ్
సింగ్ అభివర్ణించారు. ‘‘మోదీజీ.. మీరు గొప్ప మనిషిని, మంచి విద్యాశాఖ
మంత్రిని అరెస్టు చేయించడం మంచిపద్ధతి కాదు. దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు.
ఏదోఒకరోజు మీ నియంతృత్వం అంతమవుతుందని విమర్శించారు. అంతకుముందు, సిసోదియాను
కస్టడీలోకి తీసుకున్న కొద్ది నిమిషాల్లోనే ఆయన్ను అరెస్టు చేస్తారని తమకు
ముందే తెలుసని ఆప్ పేర్కొంది. సీబీఐ పూర్తిగా కేంద్రం ఆదేశాల మేరకే
పనిచేస్తోందని,మనీశ్‌ను అరెస్టు చేస్తారని తమకు ఎప్పటినుంచో తెలుసని ఆప్
ఎమ్మెల్యే సురభ్ భరద్వాజ్ వ్యాఖ్యానించారు. దర్యాప్తు సంస్థలు ఎలా
పనిచేస్తాయో ముందే చెప్పగలిగే పరిస్థితులు ఉండటం విచారకరమన్నారు.