అతడికి రీప్లేస్‌మెంట్‌గా కేవలం నాలుగు అంతర్జాతీయ టీ20లు మాత్రమే ఆడిన అనుభవం
ఉన్న సౌతాఫ్రికా బౌలర్ సిసిండ మగళను చెన్నై సూపర్ కింగ్స్ ఎంపిక చేసుకుంది.
సిసడ రూ.50 లక్షల బేస్ ప్రైజ్‌కు ఫ్రాంచైజీతో చేరనున్నాడు.ఇటీవల ముగిసిన ఎస్ఏ20 లీగ్‌లో మగళ ఆకట్టుకున్నాడు. సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్
తరఫున 12 మ్యాచ్‌ల్లో ఆడిన మగళ.. 14 వికెట్లు తీశాడు. సీఎస్ఏ 4 డే సిరీస్
డివిజన్ వన్ టోర్నీలోనూ లయన్స్ తరఫున ఆకట్టుకున్నాడు. రూ.50 లక్షల ప్రాథమిక
ధరకు ఐపీఎల్ వేలంలోకి వచ్చినప్పటికీ ఫ్రాంచైజీలు అతణ్ని పట్టించుకోలేదు. కానీ
జెమీసన్ గాయం తో దూరం కావడంతో మగళకు తొలిసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడే
అవకాశం లభించింది.
నాలుగు అంతర్జాతీయ టీ20లే ఆడినప్పటికీ.. 94 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు, 122
లిస్ట్ ఏ, 127 టీ20 మ్యాచ్‌లు ఆడిన అనుభవం 32 ఏళ్ల మగళ సొంతం. టీ20ల్లో అతడు
ఓవర్‌కు 8 పరుగుల ఎకానమీతో 136 వికెట్లు తీశాడు. అందులో రెండు ఐదు వికెట్ల
హాల్స్ కూడా ఉన్నాయి.
మంచి యార్కర్లు వేయడంతోపాటు.. వైవిధ్యంగా బంతులను సంధించగలగడం మగళ ప్రత్యేకత.
దూకుడుగా బౌలింగ్ చేసే అతడి తీరు టీ20లకు నచ్చుతుంది. అయితే చైన్నై సూపర్
కింగ్స్ ఆరంభ మ్యాచ్‌లకు మగళ దూరమయ్యే అవకాశం ఉంది. ఇటీవల అతడికి సౌతాఫ్రికా
సెంట్రల్ కాంట్రాక్ట్ లభించింది. ప్రస్తుతం వెస్టిండీస్‌తో సిరీస్‌కు ఎంపికైన
అతడు.. త్వరలో నెదర్లాండ్స్‌తో సిరీస్‌కు కూడా ఎంపికయ్యే అవకాశం ఉంది. దీంతో
మగళతోపాటు ఈ సిరీస్‌కు ఎంపికయ్యే సౌతాఫ్రికా ఆటగాళ్లు ఆలస్యంగా ఐపీఎల్‌లోకి
అడుగుపెట్టే అవకాశం ఉంది.