సామాజిక విప్లవకారుడైనా సీఎం జగన్ ను ప్రజలు మళ్ళీ ఎన్నుకుంటారు
అనగారిన వర్గాలను చంద్రబాబు కాలికింద వేసుకుని తొక్కితే వారికి పెద్ద పీట
వేసిన సీఎం జగన్
ఢిల్లీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటన పై ఏపీ ప్రజలు ముక్తకంఠంతో
స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి
చేయాలన్నదే సీఎం జగన్ ద్యేయమని ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం
వ్యాఖ్యనించారు. స్థానిక ఆర్&బీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో
ఆయన మాట్లాడుతూ సీఎం ఎక్కడ ఉండి పాలిస్తే అదే రాజధాని అవుతుందని స్పీకర్
తమ్మినేని వ్యాఖ్యానించారు.
వలసలకు సంకెళ్లు
రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే అన్ని రకాల కనీసం మౌలిక
సదుపాయాలు అందుబాటులో ఉండాలి ఆ విధంగా అన్ని రకాల సదుపాయాలు ఉన్న ప్రాంతమైన
విశాఖపట్నంని రాజధానిగా చేయడం వల్ల పెట్టుబడిదారులకు మెరుగైన అవకాశాలు
కలుగుతాయి. దీని వల్ల వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎంతో లాభం చేకూరుతూ
వలసలను నివారించి ఉపాధి అవకాశాలను కల్పించి అభివృద్ధి పథంలో దూసుకుపోవడానికి
మార్గం సుగుమవుతుంది. సముద్ర, వాయు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉంటేనే
అభివృద్ధిని సుసాధ్యం చేయగలమని పరిశ్రమలు రాష్టానికి వస్తాయని ఆయన
వ్యాఖ్యానించారు
నిన్న ఢిల్లీలో జరిగిన పారిశ్రామిక సదస్సులో జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక
దిగ్గజాలకు ఆంధ్ర రాష్ట్రానికి విశాఖ రాజధాని అని సీఎం జగన్మోహన్ రెడ్డి
తెలిపారు.ప్రతి ఒక్కరిని పేరుపేరునా పెట్టుబడులు పెట్టడానికి విశాఖ
రావాల్సిందిగా ఆహ్వానించారు.
సుదీర్ఘ తీరప్రాంతం ఉండడం ఆంధ్ర రాష్టానికి గొప్ప అవకాశంగా మారిందని పోర్టులు,
హార్బర్లు పెద్ద ఎత్తున రాష్ట్రంలో నిర్మాణాలు జరుగుతున్నాయని దీనివలన ఉపాధి
అవకాశాలు మెరుగుపడి జీవన ప్రమాణాలు పెరుగుతాయన్నారు.
ఇటువంటి పరిస్థితులను అందరూ గమనించి ఒంటరిగా ప్రజల పక్షాన నిలిచిన సీఎం జగన్
ను సామాజిక విప్లవంతో చేయి చేయి కలుపుకుని పోరాడి రేపటి ఎన్నికల్లో అణగారిన
వర్గాలైన నిరుపేదలకు మనం వేసే ఓటు సామాజిక గమనాన్ని నిర్ణయిస్తుందని ప్రజలు
గమనించాలని స్పీకర్ కోరారు.డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్, జ్యోతీరావ్ ఫులే,
మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ లాంటి వారి పోరాటాలను ప్రజలకు దక్కాలని సీఎం జగన్
కృషి చేస్తున్నారని వ్యాఖ్యానించారు.ఆంధ్ర రాష్టాన్నీ దోచుకుని లూటీ చేసిన
దొంగల ముఠా ముసుగులను సీఎం జగన్ తొలగించారని కాంగ్రెస్ అధినేత్రి
సోనియాగాంధీతో చంద్రబాబు కొమ్మక్కై తప్పుడు కేసులు పెట్టి 16 నెలలు జగన్ను
జైలులో సింహం బంధించినట్టు బంధించారని అయినా సరే ఒక్క కేసును నిరూపించలేదని
చంద్రబాబును ప్రశ్నించారు.ఆకలితో ఉన్న సింహం బోను నుండి బయటకు వచ్చి
ర్రాష్టాన్ని దోచుకుతింటున్న వారిని చీల్చి చెండాడుతుందని శాసనసభ స్పీకర్
తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు.