హైదరాబాద్ : కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌కే ఓటేస్తామమని 10 గ్రామపంచాయతీల
ప్రజలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. మాచారెడ్డి మండలంలోని ఎల్లంపేట, అంకిరెడ్డి
పల్లి, నడిమితండా, వెనకతండా, బోడగుట్టతండా, మైసమ్మచూరు, రాజకన్‌పేట,
వడ్డెరగూడెం, గుండితండా, దేవునిపల్లి పంచాయతీ ప్రతినిధులు ఈమేరకు తీర్మానం
ప్రతులను హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అందజేశారు. ఈ సందర్భంగా
కవిత మాట్లాడుతూ కేసీఆర్‌కు ఓటేస్తామని ఏకగ్రీవ తీర్మానాలు చేయడం అద్భుతంగా
అనిపిస్తోందన్నారు. షబ్బీర్ అలీ వంటి వారు ఎన్ని మాట్లాడినా ప్రజలు సీఎం
కేసీఆర్ ను కుల, మత, పార్టీలకు అతీతంగా చూస్తారన్నారు. కామారెడ్డిలోని అన్ని
నియోజకవర్గాల ప్రజలు కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. సోమవారం
కామారెడ్డిలో ఎమ్మెల్యే గంప గోవర్థన్ ఆధ్వర్యంలో జరిగే భారీ సమావేశంలో తాను
కూడా పాల్గొంటానని కవిత తెలిపారు. ఎమ్మెల్యే గంప గోవర్థన్ విజ్ఞప్తి మేరకు
సీఎం కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేయాలని నిర్ణయించినట్టు
పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, కార్పొరేషన్ల ఛైర్మన్లు
ఆయాచితం శ్రీధర్, మఠం భిక్షపతి, మేడే రాజీవ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.