ముఖ్యమంత్రి పర్యటన లో అధికారులు సమన్వయంతో పనిచేయాలి
అటవీ, విద్యుత్, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, భూగర్భ గనుల శాఖా మంత్రి
రామచంద్రారెడ్డి
చిత్తూరు : జూలై 4 న రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్తూరు పర్యటనను విజయవంతం
చేద్దామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖా మంత్రి కె.నారాయణ స్వామి
తెలిపారు. గురువారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరం లో జూలై 4 న ముఖ్య
మంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటన ఏర్పాట్ల కు సంబంధించి
అటవీ,విద్యుత్, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, భూగర్భ గనుల శాఖా మంత్రి
డా.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజం పేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి
వెంకట మిథున్ రెడ్డి, ముఖ్య మంత్రి పర్యటనల సలహాదారు తలశీల రఘురాం, జడ్పీ
చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్, జిల్లా
ఎస్పి రిశాంత్ రెడ్డి, ఎం ఎల్ సి భరత్, చిత్తూరు, పూతల పట్టు శాసన సభ్యులు
ఆరణి శ్రీనివాసులు, ఎం.ఎస్. బాబుతో కలసి వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో
సమీక్షా సమా వేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి
చిత్తూరు పర్య టనను ఉన్నతాధి కారులు, జిల్లా అధికారులు, సిబ్బంది సహకరించి ఈ
కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అటవీ, విద్యుత్, పర్యావరణ,
శాస్త్ర సాంకేతిక శాఖా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
చిత్తూరు పర్యటనలో ఎటువంటి చిన్న పాటి లోటుపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని
అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి జిల్లా కలెక్టర్ సంబంధిత
శాఖ అధికారులకు, సిబ్బందికి విధులను కేటాయించడం జరుగుతుందని, జిల్లా
యంత్రాంగానికి మంచి పేరు వచ్చేలా తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించి ఈ
పర్యటనను విజయవంతం చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లా డుతూ జూలై 4న
ముఖ్యమంత్రి చిత్తూరు పర్యటన ను అధికారులందరూ సమన్వయంతో పని చేసి విజయ వంతం
చేద్దామని, అధికారులకు కేటాయించిన విధులను బాధ్యత తో నిర్వహించి ఎటు వంటి
పొరపాట్లకు తావు లేకుండా పని చేయాలన్నారు. ఈ సమీక్షా సమా వేశంలో జెసి పి.
శ్రీనివాసులు, డి ఆర్ ఓ ఎన్. రాజశేఖర్, చిత్తూరు నగర మేయర్ అముద, జడ్పీ వైస్
చైర్మన్ రమ్య, రేస్కో చైర్మన్ సెంథిల్ కుమార్, జడ్పీ సీఈఓప్రభాకర్ రెడ్డి,డి
ఆర్ డి ఏ, డ్వామాపిడిలు, తులసి, గంగాభవాని, ఆర్ అండ్ బి, పి ఆర్ ఎస్ఈలు
ఉమామహేశ్వర్ రెడ్డి, చంద్ర శేఖర్ రెడ్డి, డి ఈ ఓ విజయేంద్ర రావు, సమగ్ర శిక్ష
ఏ పి సి వెంకట రమణా రెడ్డి, ఆర్ టిసి ఆర్ ఎం జితేంద్ర నాధ్ రెడ్డి, డి టి సి
నిరంజన్ రెడ్డి, ట్రాన్స్కో ఎస్ ఈ కృష్ణారెడ్డి, ఇంచార్జి డిఎం & హెచ్ ఓ
డా.రాజ శేఖర్ రెడ్డి,డి పి ఓ లక్ష్మీ,సి పి ఓ ఉమా దేవి, మెప్మా పీడీ రాధమ్మ,
చిత్తూరు, కుప్పం ఆర్డీఓ లు రేణుక, శివయ్య,చిత్తూరు మున్సిపల్ కమిష నర్ అరుణ,
వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తది తరులు పాల్గొ న్నారు.