విశాఖపట్నం, తిరుపతి, పులివెందులలో ఏర్పాటుకు ట్రస్ట్ అంగీకారం
తిరుపతిలో స్కూల్ శంకుస్థాపనకు రావాలని జగన్‌కు ఆహ్వానం
గుంటూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బుధవారం తాడేపల్లిలో సీఎం
క్యాంపు కార్యాలయంలో శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ ట్రస్ట్ సభ్యులు కలిశారు.
రాష్ట్రంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటుకు ఈ ట్రస్ట్ సంసిద్ధత వ్యక్తం
చేసింది. విశాఖపట్నం, తిరుపతి, పులివెందులలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటుకు
అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో బుధవారం ముఖ్యమంత్రిని కలిసిన ట్రస్ట్
సభ్యులు సెప్టెంబర్ నెలలో తిరుపతి స్కూల్ శంకుస్థాపనకు రావాలని ఆహ్వానించారు.
దీనికి ముఖ్యమంత్రి కి ఆహ్వానం పలికారు.
సీఎంతో సమావేశం అనంతరం ట్రస్టీ మెంబర్ సుఖ్‌వల్లభ్ స్వామి మాట్లాడుతూ శ్రీ
స్వామినారాయణ్ గురుకుల్ గ్రూప్‌కి ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్,
చత్తీస్గడ్, రాజస్ధాన్, న్యూఢిల్లీ, యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియాలలో 52
కు పైగా విద్యాసంస్ధలు, 40 వేల మందికి పైగా విద్యార్ధులు ఈ గురుకులాల్లో
విద్యనభ్యసిస్తున్నారు. తమ విద్యాసంస్ధల ఏర్పాటుకు మూడు ప్రాంతాల్లో ఏపీ
ప్రభుత్వం భూములు కేటాయించడంతో సీఎంగారికి కృతజ్ఞతలు తెలియజేశాం. తిరుపతి
స్కూల్ శంకుస్ధాపన తర్వాత అతి త్వరలోనే పులివెందుల, విశాఖ స్కూల్స్‌కు కూడా
భూమి పూజ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ స్కూల్స్ ఏర్పాటు చేయడం
ద్వారా ఆధునిక విద్యతో పాటు విలువలతో కూడిన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను
నేటి తరానికి భోదించడమే తమ లక్ష్యమని, ఆ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఈ
సమావేశంలో పాల్గొన్న ట్రస్టీ మెంబర్ సుఖ్‌వల్లభ్ స్వామి, ధర్మ్‌సాగర్
స్వామి, మాజీ మంత్రి జలగం ప్రసాదరావు పాల్గొన్నారు.