వెలగపూడి : రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక
మార్పులు తెచ్చారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇంధన
రంగంలో భారీగా పెట్టుబడులు వచ్చాయని, పరిశ్రమల ద్వారా వేలాది మంది యువతకు
ఉపాధి దొరుకుతుందన్నారు. అసెంబ్లీ ఐదో రోజు బడ్జెట్ సమావేశాల సందర్బంగా
విశాఖపట్నం గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్‌పై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో
సమ్మిట్‌పై మంత్రులు, ఎమ్మెల్యేలు కీలక వ్యాఖ్యలు చేశారు. యువతకు ఉపాధి
కల్పించే రంగాలపై ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలిపారు. దేశంలోని ప్రముఖ
పారిశ్రామికవేత్తలంతా జీఐఎస్‌కు వచ్చినట్టు స్పష్టం చేశారు. అనేక రంగాల్లో
ఎంఓయూలు కుదుర్చుకున్నామన్నారు.
సీఎం వైఎస్ జగన్ యూత్ ఐకాన్ : పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా
సీఎం వైఎస్ జగన్ యూత్ ఐకాన్ అని మంత్రి ఆర్కే రోజా అన్నారు. జీఐఎస్‌తో
సీఎం వైఎస్ జగన్ ఖ్యాతి విశ్వవ్యాప్తం అయ్యింది. పరిశ్రమల ద్వారా ఆరు లక్షల
మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్ పట్ల
పారిశ్రామికవేత్తలు విశ్వాసంతో ఉన్నారు. టీడీపీ నేతల గోబెల్స్ ప్రచారాన్ని
గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌తో తిప్పికొట్టాం. దిగ్గజ పారిశ్రామికవేత్తలంతా
ఒకే వేదికపైకి రావడం ఎన్నడూ లేదు. జె అంటే జగన్.. జె అంటే జోష్ అని
పారిశ్రామికవేత్తలే చెప్పారు. జీఐఎస్‌తో సీఎం జగన్ ట్రెండ్ సెట్టర్ అని
మరోసారి రుజువు చేశారు. పర్యాటక రంగంలో 129 ఎంవోయూలు కుదుర్చుకున్నాం. 40
ఇయర్స్ అని చెప్పుకునే చంద్రబాబు రాష్ట్రానికి అన్యాయం చేశారు. చంద్రబాబు
హయంలో ప్రచారం ఎక్కువ.. పెట్టుబడులు తక్కువ అని ఎద్దేవా చేశారు.