కొవ్వూరు : కాంట్రాక్టు ఉద్యోగుల రెండు దశాబ్దాల కలను నెరవేరుస్తూ
క్రమబద్ధీకరణ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రుణం
తీర్చుకుంటామని ఉద్యోగులు తెలిపారు. ఈ మేరకు కొవ్వూరు నియోజకవర్గంలో
హోంమంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం రాత్రి సీఎం జగన్ చిత్రపటానికి
పాలాభిషేకం చేశారు. కొవ్వూరు డివిజన్ లోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల
నుంచి (మెడికల్ అండ్ హెల్త్) ఉద్యోగులు రాష్ట్ర హోంమంత్రి తానేటి వనితను కలిసి
ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం థాంక్యూ సీఎం సార్ అంటూ నినాదాలు చేస్తూ
పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ గత
20 ఏళ్లుగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న తమని రెగ్యులరైజ్ చేయడంపట్ల
సంతోషం వ్యక్తం చేశారు. నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ ముఖ్యమంత్రి తమకు
న్యాయం చేశారని తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారని
అన్నారు. అటువంటి ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటామని వ్యాఖ్యానించారు.
అవసరం వచ్చినప్పుడు మేం కృతజ్ఞతలు తెలియజేస్తూ రుణం తీర్చుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్.వి.వి. సత్యనారాయణ, ఎం. దుర్గాప్రసాద్, డి. ప్రసన్న
కుమార్ తదితరులు పాల్గొన్నారు.