గుంటూరు : ప్రముఖ నగల విక్రయ సంస్థ జోయాలుక్కాస్ అధినేత అలుక్కాస్ వర్గీస్
జాయ్ నేడు ఏపీ సీఎం జగన్ ను కలిశారు. వర్గీస్ జాయ్ తాడేపల్లిలోని సీఎం క్యాంపు
కార్యాలయానికి విచ్చేశారు. సీఎంతో సమావేశమై పలు అంశాలపై మాట్లాడారు. ఏపీలో
పెట్టుబడులు, అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా, ఏపీలో తాము అమలు చేస్తున్న
ప్రభుత్వ విధానాలను సీఎం జగన్ జోయాలుక్కాస్ అధినేతకు వివరించారు. ఏపీలో
పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక
విధానం, సత్వర అనుమతులపై వివరాలు తెలిపారు. జోయాలుక్కాస్ వస్తే
స్వాగతిస్తామని, సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్ హామీ
ఇచ్చారు.