గుంటూరు : సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఆయన తనయులు (వైఎస్సార్సీపీ ఏలూరు లోక్సభ ఇన్ఛార్జి) కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ శుక్రవారం కలిశారు. ఏలూరు లోక్ సభ ఇన్చార్జిగా నియమించిన సందర్భంగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, తనయులు కారుమూరి సునీల్ కుమార్ సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.