● వెయ్యి మందితో రక్తదాన శిబిరం, వేలాది మందికి అన్నదానం..!
●వేలాదిగా తరలిరావాలని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పిలుపు..!
వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చేపట్టిన ప్రజా సంకల్ప
యాత్ర రాప్తాడుకు చేరుకుని ఐదేళ్లయిన నేపథ్యంలో ఆరోజును గుర్తు చేసుకుంటూ ఈ
నెల 21న వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రాప్తాడులో ‘ప్రజా
సంకల్ప సభ’ ఏర్పాటు చేయనున్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా అప్పట్లో
రాప్తాడులో జరిగిన బహిరంగ సభ హైలెట్‌గా నిలిచింది. తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
ఉద్వేగభరితంగా చేసిన ప్రసంగం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాప్తాడు
నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరిస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి
ప్రకటించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత∙నాలుగు రిజర్వాయర్ల ఏర్పాటుకు
గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. త్రాగు, సాగు నీటి విషయాల్లో ఇచ్చినమాట
నెరవేర్చుకున్న సందర్భంగా జరుగుతున్న ‘ప్రజా సంకల్ప సభ’కు రాప్తాడు
నియోజకవర్గం నుంచి వేలాది మంది తరలిరావాలని ఎమ్మెల్యే తోపుదుర్తి
ప్రకాష్‌రెడ్డి పిలుపునిచ్చారు.
●వెయ్యిమంది తో రక్తదానం..!
వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 21న రాప్తాడులో వెయ్యి
మంది తో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
నియోజకవర్గంలో రక్తదానానికి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
●వేలాది మందికి అన్నదానం..!
పేద, బడుగు బలహీన బలహీన వర్గాల వారికి నేనున్నానంటూ భరోసానిస్తూ సంక్షేమ
పథకాలు అమలు చేస్తున్న జననేత జగనన్న పుట్టినరోజు సందర్భంగా రాప్తాడులో వేలాది
మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
●తేదీ : 21/12/2022
●సమయం : మధ్యాహ్నం 2:00 గంటలకు..!
●వేదిక: రాప్తాడు మండల కేంద్రంలోనీ ఎంపీడీవో కార్యాలయంలో..!