కడప : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 8 నుంచి 10వ తేదీ వరకు
జిల్లాలో పర్యటిస్తారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి
సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద జరిగే కార్యక్రమాల్లో
పాల్గొంటారు. ఆదివారం గండికోట, పులివెందులలో పర్యటించి వివిధ అభివృద్ధి పనులను
ప్రారంభిస్తారు. సోమవారం కడప నగరంతోపాటు కొప్పర్తి పారిశ్రామికవాడను
సందర్శించి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు.
8వ తేదీ పర్యటన ఇలా : మధ్యాహ్నం 1.30 గంటలకు కల్యాణదుర్గంలో బయలుదేరి 1.55
గంటలకు ఇడుపులపాయ హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 2.05 గంటలకు వైఎస్సార్
ఘాట్ వద్దకు వెళతారు. 2.25 గంటల వరకు అక్కడ జరిగే ప్రార్థనల్లో పాల్గొంటారు.
మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పిస్తారు. 2.25
గంటలకు ఘాట్ నుంచి బయలుదేరి ప్రేయర్ హాలుకు 2.30 గంటలకు చేరుకుంటారు. 5.30
గంటల వరకు సింహాద్రిపురం మండల ప్రజా ప్రతినిధులతో సమావేశమవుతారు. 5.35కు
హెచ్‌సీఎం రెసిడెన్స్‌కు చేరుకుంటారు.
9వ తేదీ ఉదయం 8.50 గంటలకు హెచ్‌సీఎం రెసిడెన్సి నుంచి బయలుదేరి 8.55 గంటలకు
హెలిప్యాడ్ చేరుకుంటారు. 9.20 గంటలకు గండికోట హెలిప్యాడ్ వద్దకు
చేరుకుంటారు. 9.30 గంటలకు ఒబెరాయ్ హోటల్ శంకుస్థాపనలో పాల్గొంటారు.10.15
గంటలకు గండికోట వ్యూ పాయింట్‌కు చేరుకుంటారు. 10.25 గంటలకు బయలుదేరి 10.30
గంటలకు గండికోట హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 10.50 గంటలకు పులివెందుల భాకరాపురం
హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 11.05 గంటలకు పులివెందుల కొత్త మున్సిపల్
కార్యాలయ భవనం వద్దకు చేరుకుంటారు. 11.40 గంటల వరకు మున్సిపల్ కార్యాలయ భవన
ప్రారంభోత్సవం, పులివెందుల కౌన్సిలర్లతో సమావేశమవుతారు. 11.45 గంటలకు రాణితోపు
చేరుకుంటారు. 12.10 గంటల వరకు పులివెందుల సిటీ ఫారెస్టు ప్రారంభోత్సవంలో
పాల్గొంటారు. 12.15 గంటలకు గరండాల రివర్ ఫ్రంట్‌కు చేరుకుని గరండాల కెనాల్
డెవలప్మెంట్ మొదటి దశ పనులను ప్రారంభిస్తారు. 12.50 నుంచి 1.15 గంటల వరకు
వైఎస్సార్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో
పాల్గొంటారు. 1.25 గంటలకు న్యూటెక్ బయోసైన్స్, ఏపీ కార్ల్‌లో
ప్రారంభోత్సవాల్లో గడుపుతారు. 1.50 గంటలకు ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌కు
చేరుకుంటారు. 2.20 గంటల వరకు రిజర్వు 2.30 గంటలకు వైఎస్సార్ స్పోర్ట్స్
అకాడమి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. 3.10 గంటలకు భాకరాపురం
హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 3.15 గంటలకు బయలుదేరి 3.35 గంటలకు ఇడుపులపాయ
హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 3.35 నుంచి 4.05 గంటల వరకు ప్రజాప్రతినిధులతో
సమావేశమవుతారు. 4.10కి హెచ్‌సీఎం రెసిడెన్స్‌కు చేరుకుంటారు.
10వ తేదీ ఉదయం 8.50 గంటలకు హెచ్‌సీఎం రెసిడెన్స్ నుంచి బయలుదేరి
హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 9.20 గంటలకు కడప ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల
హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 9.25 నుంచి 10 గంటల వరకు ప్రజాప్రతినిధులతో
సమావేశమవుతారు. 10గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 10.10 గంటలకు రాజీవ్ మార్గ్
చేరుకుంటారు. 10.20 గంటల వరకు రాజీవ్ మార్గ్ రోడ్డు ప్రారంభోత్సవంలో
గడుపుతారు. 10.25కు రాజీవ్ పార్కు చేరుకుంటారు. 10.35 గంటల వరకు పలు
అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేస్తారు. 10.50 గంటలకు హెలిప్యాడ్
నుంచి బయ లుదేరి 11.00 గంటలకు కొప్పర్తి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 11.10
గంటలకు అల్ డిక్సన్ యూనిట్‌కు చేరుకుని ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. 11.35
నుంచి 11.45 గంటల వరకు పారిశ్రామిక యూనిట్ల శంకుస్థాపన కార్యక్రమాల్లో
గడుపుతారు. 11.55 గంటలకు హెలిప్యాడ్ నుంచి బయలుదేరి 12.10 గంటలకు కడప
విమానాశ్రయానికి చేరుకుంటారు. 12.15 గంటలకు విమానాశ్రయం నుంచి బయలుదేరి
మధ్యాహ్నం 1.00 గంటకు గన్నవరం విమానాశ్రయానికి వెళతారు 1.30 గంటలకు సీఎం
నివాసానికి వెళతారు.