టీఎస్ హైకోర్టు కీలక ఆదేశాలు
హైదరాబాద్ : తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ కొనసాగింపును తెలంగాణ హైకోర్టు
రద్దు చేసింది. సీఎస్ సోమేష్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై కోర్టు కీలక
తీర్పు ఇచ్చింది. ఏపీ క్యాడర్‌కు వెళ్లాలని హైకోర్టు ఆదేశించింది. కేంద్ర
పరిపాలన ట్రిబ్యునల్ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్ర విభజనప్పుడు
సోమేష్ కుమార్‌ను కేంద్రం ఏపీకి కేటాయించింది. కేంద్రం ఉత్తర్వులు నిలిపివేసి
తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. క్యాట్ మధ్యంతర
ఉత్తర్వులతో సోమేష్‌కుమార్ తెలంగాణలో కొనసాగుతున్నారు. క్యాట్ ఉత్తర్వులు
కొట్టివేయాలని 2017లో హైకోర్టును కేంద్రం ఆశ్రయించింది. క్యాట్ ఉత్తర్వులు
కొట్టివేస్తూ సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్ తీర్పునిచ్చింది.
ఎలాంటి సమయం ఇవ్వని హైకోర్టు : 3 వారాలు సమయం కావాలని సోమేష్ కుమార్ తరపు
న్యాయవాది అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. తీర్పు కాపీ రాగానే ఏపీకి
వెళ్లిపోవాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ
సోమేష్‌కుమార్ సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిసింది.