కెనడియన్ సాయుధ దళాలు(CAF).. తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది. కెనడాలోని
విదేశీ పౌరులకు మిలటరీలో చేరే అవకాశం కల్పించింది. శాశ్వత నివాస హోదా కలిగిన
విదేశీ పౌరులు.. కెనడీయన్ ఆర్మ్ డ్ ఫోర్స్ (CAF)లో చేరవచ్చని ప్రకటనలో
తెలిపింది. ఈ క్రమంలో అక్కడ నివసిస్తున్న భారతీయులకు లబ్ధి చేకూరే అవకాశం
ఉంది. కెనడాలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలను మానవ వనరుల కొరత తీవ్రంగా
వేధిస్తోంది. ఈ క్రమంలోనే కెనడా ప్రభుత్వం తమ దేశంలోకి భారీ స్థాయిలో వలసలను
ప్రోత్సహిస్తోంది. గత ఏడాది కెనడా చరిత్రలోనే అత్యధికంగా నాలుగు లక్షల మందికి
శాశ్వత నివాస హోదా కల్పించింది. ఈ నేపథ్యంలో దాదాపు లక్ష మంది భారతీయులు
కెనడాలో శాశ్వత నివాస హోదా లభించింది. అంతేకాకుండా 2022-24 మధ్య సుమారు
10లక్షల కంటే ఎక్కువ మంది విదేశీ పౌరులకు శాశ్వత నివాస హోదా కల్పించాలని
భావిస్తోంది. ఈ క్రమంలోనే శాశ్వత నివాస హోదా కలిగిన విదేశీయులకు మిలటరీలో చేరే
అవకాశాన్ని కెనడియన్ ఆర్మ్ డ్ ఫోర్స్ కల్పించింది. CAF నిర్ణయంతో ఇప్పటికే
కెనడాలో స్థిరపడ్డ (శాశ్వత నివాస హోదా పొందిన) భారతీయులకు లబ్ధి చేకూరనుంది.