డెంగ్యూ, మలేరియా విషయంలో మరింత అప్రమత్తంగా ఉన్నాం * నిరంతర పర్యవేక్షణ,
సమీక్షలతో కట్టుదిట్టమైన చర్యలు * ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్
డాక్టర్ వేమిరెడ్డి రామిరెడ్డి వెల్లడి
విజయవాడ : రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల్ని కట్టడి చేసేందుకు పటిష్టమైన చర్యలు
తీసుకుంటున్నామని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్
వేమిరెడ్డి రామిరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఆదివారం నాడొక ప్రకటన విడుదల
చేశారు. మలేరియా, డెంగ్యూ, తదితర ఇతర వ్యాధుల్ని అరికట్టేందుకు అనేక చర్యలు
ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని, మరింత అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. ఈ
ఏడాది ఫిబ్రవరి మాసంలో అన్నిజిల్లాల మలేరియా అధికారులతో సమీక్షా సమావేశాల్ని
నిర్వహించి గత నాలుగేళ్లలో నమోదైన మలేరియా పీడిత గ్రామాలను గుర్తించామన్నారు.
ఇందులో భాగంగా దాదాపు 4.72 లక్షల జనాభా ఉన్న 1969 గ్రామాలలో మలేరియా కారక
దోమల్ని నియంత్రించేందుకు రెండు రౌండ్లు పిచికారి కార్యక్రమాన్ని
నిర్దేశించామన్నారు. మొదటి రౌండ్ ను ఏప్రిల్ 15వ తేదీ నుండి జూన్ 30 నాటికి
పూర్తి చేశామన్నారు. రెండవ రౌండ్ జూలై 1 వ తేదీ నుండి అల్లూరి సీతా రామరాజు,
అనకాపల్లి జిల్లాలలో మొదలు పెట్టామన్నారు. మిగతా జిల్లాలలో ఈనెల 15న ఇప్పటికే
మొదలు పెట్టామనీ, ఆగష్టు ఒకటో తేదీ నాటికి ముగుస్తుందని డాక్టర్ రామిరెడ్డి
తెలిపారు . ప్రజల భాగస్వామ్యం, అవగాహన కోసం ఏప్రిల్ 25నాడు ప్రపంచ మలేరియా
దినోత్సవాన్ని నిర్వహించామన్నారు. అలాగే జూన్ నెలను మలేరియా వ్యతిరేకోత్సవ
మాసంగా పరిగణించి అనేక కార్యక్రమాల్ని నిర్వహించామన్నారు. చికిత్స, మాస్,
కాంటాక్ట్ సర్వే, ఫోకల్ స్ప్రే, యాంటీ లార్వా ఆపరేషన్లు, ఇండోర్ స్పేస్
స్ప్రే, ఫాగింగ్ ఆపరేషన్లు వంటి అన్ని రకాల నివారణా చర్యల్ని చేపట్టామన్నారు .
ఈ ఏడాది మొత్తం 35,22,451 మంది మలేరియా పీడితులుగా గుర్తించి పరీక్షలు చేయగా
1630 మందికి మలేరియా సోకినట్టు గుర్తించామన్నారు. మొత్తం 25.95 లక్షల
లాంగ్-లాస్టింగ్ క్రిమిసంహారక వలల్ని కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయగా
రాష్ట్రంలోని ఇతర మలేరియా ప్రాంతాలతో సహా మలేరియా ప్రమాదకర గిరిజన ప్రాంతాలలో
పంపిణీ చేశామని డాక్టర్ రామిరెడ్డి వివరించారు.దోమల లార్వాల నివారణ,
నియంత్రణలో భాగంగా మత్స్య శాఖ సమన్వయంతో గురించిన నీటి వనరులలో కోటి
గంబూసియా చేపల్ని విడుదల చేసేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు
చేశామన్నారు. స్ప్రే కార్యక్రమాల్ని సమర్ధవంతంగా నిర్వహించేందుకు జిల్లా
కలెక్టర్లు/ఐటిడిఎ పీవోల పర్యవేక్షణలో డీపీవో, వ్యవసాయ, మత్స్య శాఖ లు , ఎస్సీ
కార్పొరేషన్, డీఎస్వో, డిఇవో , డిఎల్పీవో వంటి జిల్లా స్థాయి అధికారులు, అలాగే
మండల స్థాయిలో తహశీల్దార్, ఎంపీడీవో, ఈవో పీఆర్డీ, ఉపాధి హామీ ఏపీవో, హౌసింగ్
ఏఈ అధికారులు సీజనల్ వ్యాధుల కట్టడికి గాను పనిచేస్తున్నారన్నారు. ప్రతి
శుక్రవారం డ్రై డే క్యాంపెయిన్ మరియు వెక్టర్ కంట్రోల్ & హైజీన్ యాప్
కార్యకలాపాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు మలేరియా, డెంగ్యూ, ఇతర వ్యాధులపై
నియంత్రణ చర్యల కోసం మున్సిపల్, పంచాయతీ రాజ్ అలాగే ఇతర విభాగాలతో తరచూ
సమావేశాల్ని కలెక్టర్ల ఆధ్వర్యంలో జరుగుతున్నాయన్నారు. ఇంకా లార్వా నియంత్రణ
చర్యల నిర్వహణ కోసం సబ్ యూనిట్ ఆఫీసర్(మలేరియా) ప్రత్యేక అప్లికేషన్ ద్వారా
తనిఖీ చేస్తున్నారన్నారు. డెంగ్యూ నియంత్రణపై వ్యూహాత్మక ప్రణాళికను సిద్ధం
చేస్తూనే మే , జూలై నెలల్లో జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని మరియు డెంగ్యూ
నిరోధక మాసంగా పరిగణించి అనేక కార్యక్రమాల్ని నిర్వహించామన్నారు. డెంగ్యూ కారక
ఏడీస్ దోమల పిల్లలను నియంత్రించేందుకు ఎఎన్ ఎం, వాలంటీర్లు ప్రతి వారం
ఇటింటికీ వెళ్ళి ప్రజలలో ఏడీస్ దోమల వృద్దిని అరికట్టే విషయంలోలో చైతన్య
పరుస్తున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వంచే గుర్తించిన 54 సెంటినల్ సర్వేలెన్స్
హాస్పిటళ్లలో డెంగ్యూ రోగ లక్షణాలున్న 40,194 సెరా శాంపిళ్లను పరీక్షిచంగా
2,329 డెంగ్యూ కేసుల్ని గుర్తించామన్నారు. 2019 నుండి డాక్టర్ వైఎస్ఆర్
ఆరోగ్యశ్రీ కింద మలేరియా మరియు డెంగ్యూకి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత చికిత్స
అందిస్తోందనీ, ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చలవే అన్నారు. వైద్య ఆరోగ్య
కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడుదల రజిని, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
ఎం.టి.కృష్ణ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ సీజనల్
వ్యాధులపై జిల్లా స్థాయి అదికారులతో ఈనెల 7న వీడియో కాన్ఫరెన్స్ నివహించి
స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారన్నారు. ఎక్కడా ఏ ఒక్క కేసు వచ్చినా అప్రమత్తంగా
ఉండాలని ఆదేశాలిచ్చారన్నారు. నేషనల్ వెక్టార్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్
ప్రోగ్రాం స్టేట్ హెడ్ క్వార్టర్స్ విజయవాడలో స్టేట్ కన్సల్టెంట్ లను ఈనెలలో
జిల్లాలకు నియమించామని డాక్టర్ రామిరెడ్డి తెలిపారు. నిఘా, చికిత్స, నియంత్రణ
మొదలైన క్షేత్రస్థాయి కార్యకలాపాల్ని పరిశీలించేందుకు జిల్లాలను
సందర్శించాలని వారిని ఆదేశించామన్నారు. అంతేకాకుండా సీజనల్ వ్యాధుల నివారణ,
నియంత్రణలో సమర్థవంతమైన ఇంటర్-సెక్టోరల్ సమన్వయం కోసం కలెక్టర్లు ప్రతి వారం
అన్ని జిల్లా స్థాయి అధికారులతో జిల్లా సమన్వయ సమావేశాల్ని క్రమం తప్పకుండా
నిర్వహిస్తున్నారన్నారు. ఈ ఏడాదిలో మలేరియా, డెంగ్యూ ఆర్డీటీ కిట్లు డాక్టర్
వైయస్ ఆర్ హెల్త్ క్లినిక్ ల స్థాయి వరకు అందుబాటులో ఉంచామనీ, అలాగే ప్రాథమిక
ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లు ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం కింద క్రమం
తప్పకుండా సందర్శించి జ్వర సంబందిత, యాంటీ-నేటల్ కేసులు, అలాగే పిల్లల ఆరోగ్యం
మొదలైన వాటిని పర్యవేక్షిస్తున్నారన్నారు, మలేరియా, డెంగ్యూ పరీక్షలకు
సంబంధించి గ్రామ/వార్డు సచివాలయాలు , విలేజ్ హెల్త్ క్లినిక్ లు , పీహెస్సీలతో
పాటు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాల పరిథిలో కూడా టెస్టింగ్ సదుపాయాల్ని
పెంచామన్నారు. దీంతో ఈ ఏడాదిలో మలేరియా , డెంగ్యూ కు సంబంధించి పరీక్షలు,
రోగనిర్ధారణ చర్యలు పెరిగాయని ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్
డాక్టర్ వేమిరెడ్డి రామిరెడ్డి వివరించారు.