అమరావతి : రాయలసీమ కరవు నివారణ ప్రాజెక్టు పనులపై టీడీపీ ఎమ్మెల్యే , ప్రజా
పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ మరోసారి స్పందించారు. ప్రాజెక్టు
పనుల్లో అక్రమాలపై సీబీఐ విచారణకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు
ఆమోదించడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు పనుల కుంభకోణంపై
త్వరలోనే సీబీఐకి లేఖ రాయనున్నట్లు తెలిపారు. ఎంబుక్ రికార్డును
నిర్ధారించుకున్నాకే బిల్లులు చెల్లించారని చెబుతూ కోర్టులను, ప్రజలను
తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్టులో కుంభకోణం జరిగిందనేందుకు
ఇంకేం సాక్ష్యం కావాలని ప్రశ్నించారు. ప్రాజెక్టులో ఎలక్ట్రో మెకానికల్ పనుల
ఖర్చు రూ.100కోట్లు కాగా మంత్రి అంబటి మాత్రం రూ.739కోట్లు విడుదల చేశామని
చెప్పారని విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతలకు 2020జులైలో టెండర్లు పిలిచారని,
అప్పటికి రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ కార్పొరేషన్ లేనేలేదని అన్నారు.
రుణాన్ని తీసుకునేందుకు 2020 నవంబరులో కంపెనీ ఏర్పాటు చేశారని పయ్యావుల కేశవ్
తెలిపారు.