సీఆర్పీసీ 161కింద కవిత స్టేట్మెంట్ రికార్డు
అవసరమైతే మళ్లీ విచారించే అవకాశం
హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట కవిత ఆదివారం రాత్రి సీఎం
కేసీఆర్‌తో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి బయల్దేరిన కవిత
ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. ఆమె వెంట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా
ఉన్నారు. సీబీఐ విచారణపై కేసీఆర్‌కు వివరించారు. 45 నిమిషాలపాటు వీరి సమావేశం
కొనసాగింది. అనంతరం ప్రగతిభవన్ నుంచి కవిత తన ఇంటికి వెళ్లారు. కాగా ఢిల్లీ
లిక్కర్ స్కాం కేసులో కవితను సీబీఐ ఆదివారం విచారించిన విషయం తెలిసిందే. ఉదయం
11 గంటల నుంచి దాదాపు 7 గంటలపాటు కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు.
సీఆర్పీసీ 161కింద కవిత స్టేట్మెంట్ను రికార్డు చేశారు. విచారణ ముగియడంతో
సీబీఐ అధికారులు ఢిల్లీకి తిరిగి వెళ్లారు. అవసరమైతే మళ్లీ విచారించే అవకాశం
ఉంది. మరోవైపు కవిత విచారణకు సంబంధించి సీబీఐ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
ఎమ్మెల్సీ కవితను ఏడున్నర గంటలపాటు విచారించిన సీబీఐ : తెరాస ఎమ్మెల్సీ
కల్వకుంట్ల కవిత సీబీఐ విచారణ తెలంగాణలో ఉత్కంఠ రేపింది. దాదాపు 7.30గంటల పాటు
ఆమెను సీబీఐ అధికారులు ప్రశ్నించి వివరాలు సేకరించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం
కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐ విచారణ ముగిసింది. ఈ కేసుకు
సంబంధించి కవిత ఇంట్లోనే సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. రెండు బృందాల్లో
వచ్చిన సీబీఐ అధికారులు సుమారు ఏడున్నర గంటలపాటు విచారించి ఆమె నుంచి వివరాలు
సేకరించారు. సీఆర్పీసీ 160 కింద కవితను సాక్షిగా మాత్రమే విచారించి వాంగ్మూలం
నమోదు చేసినట్టు సమాచారం. ముందుగా తెలిపిన సమాచారం మేరకు ఇవాళ ఉదయం 11 గంటలకు
రెండు వాహనాల్లో బంజారాహిల్స్‌లోని కవిత నివాసానికి సీబీఐ అధికారులు
చేరుకున్నారు. వారిలో ఒక మహిళా అధికారి కూడా ఉన్నారు. సీబీఐ విచారణ నేపథ్యంలో
కవిత నివాసం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ కవిత 10
ఫోన్లు ధ్వంసం చేశారని అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో సీబీఐ పేర్కొంది. ఈ
అంశంపైనే ఎక్కువగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈకేసుకు సంబంధించి ఇప్పటి
వరకు ఆమెను సాక్షిగా మాత్రమే విచారించారు. ఇంతటి విచారణ పూర్తయిందా? లేక
మరోసారి కవితను విచారాస్తారా? అనే దానిపై సీబీఐ అధికారుల నుంచి ఇంకా స్పష్టత
రాలేదు. సీబీఐ విచారణ నేపథ్యంలో కవిత నివాసం వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు
భారీగా చేరుకున్నారు.
ప్రగతి భవన్‌కు వెళ్లిన ఎమ్మెల్సీ కవిత : సీబీఐ సుదీర్ఘ విచారణ అనంతరం
బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో ఎమ్మెల్సీ కవితతో మంత్రి తలసాని శ్రీనివాస్
యాదవ్ సమావేశమయ్యారు. అనంతరం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమె కార్యకర్తలకు
అభివాదం చేశారు. తర్వాత మంత్రి తలసానితో కలిసి ప్రగతి భవన్‌కు వెళ్లారు. ఉదయం
నుంచి జరిగిన సీబీఐ విచారణ, తదితర పరిణామాలను కవిత సీఎం కేసీఆర్‌కు
వివరించినట్లు సమాచారం.