విజయనిర్మల
విశాఖపట్నం : మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ రెండవ జోన్ 12వ వార్డు పరిధిలోని
కనకదుర్గ నగర్, రాజేంద్రనగర్, దుర్గా నగర్ తదితర ప్రాంతాలలో సీసీ డ్రైన్ల
నిర్మాణానికి నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, విశాఖ తూర్పు నియోజకవర్గ
సమన్వయకర్త అక్రమాన్ని విజయనిర్మల, వార్డ్ కార్పొరేటర్ అక్రమాన్ని రోహిణి తో
కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ విశాఖ
నగర పరిధిలోని ప్రతి వార్డును మౌలిక వసతుల కల్పనలో జగనన్న ప్రభుత్వం ఎంతో
కృషి చేస్తుందన్నారు. 12వ వార్డులో కనకదుర్గ నగర్ లో రూ 5.86 లక్షలు,
రాజేంద్రనగర్లో రూ. 5.91 లక్షలు, దుర్గా నగర్ లో రూ.8.22 లక్షలు వ్యయంతో సీసీ
డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. అలాగే 12వ వారికి సంబంధించి
ఇప్పటికే కార్పొరేటర్ విన్నపం మేరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల తో పాటు
సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. అనంతరం తూర్పు
నియోజకవర్గం సమన్వయకర్త మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సారథ్యంలో జీవీఎంసీ
నిధులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ప్రతి వార్డ్ లో
మౌలిక వసతుల కల్పన ధ్యేయంగా పనిచేస్తున్నామని, రానున్న రోజుల్లో మరిన్ని
అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సహాయం
ఇంజినీర్ అప్పాజీ, సచివాలయం సెక్రటరీలు, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు,
స్థానిక పెద్దలు తదితరులు పాల్గొన్నారు.