సికింద్రాబాద్ : డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ శుక్రవారం రాష్ట్ర
ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు. ప్రగతి భవన్ లోని ఆయన
నివాసంలో సీ ఎంను కలిశారు. ఈ నెల 9 వ తేదిన సికింద్రాబాద్ లో జరిగే బోనాలు
వేడుకలకు హాజరు కావాలని ఆహ్వానించారు. ప్రతి ఏటా లష్కర్ బోనాలు వేడుకల్లో
పాల్గొనడంతో పాటు మోండా మార్కెట్ లో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కుటుంబ
సభ్యులు నిర్మించిన ముత్యాలమ్మ దేవాలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించడం,
అనంతరం పద్మారావు గౌడ్ నివాసంలో విందుకు హాజరు కావడం కెసిఆర్‌తో పాటు ఆయన
కుటుంబ సభ్యులు ప్రతీ ఏటా హాజరవుతున్నారు. పద్మారావు గౌడ్ కుమారులు కిషోర్
కుమార్, రామేశ్వర్ గౌడ్, త్రినేత్ర గౌడ్ ఉన్నారు.