రెండు సంస్థల నిధులతో పలు చోట్ల స్వైపింగ్ స్టేషన్లు
విశాఖపట్నం : సుస్థిర పర్యావరణం కోసమే ఓ ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టామని,
అందుకోసమే ఈ`ఆటోల వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి, విశాఖ
జిల్లా ఇన్చార్జి మంత్రి విడదల రజిని స్పష్టం చేశారు. కాలుష్య నియంత్రణకు
నగరంలోని బీచ్‌రోడ్డులో శనివారం ఈ ఆటోల్ని నగర మేయర్ గోలగాని హరి వేంకట
కుమారి, ఎమ్మెల్యేలు అవంతి శ్రీనివాసరావు, తిప్పల నాగిరెడ్డి, అదీప్ రాజ్, వి
యం ఆర్ డి ఏ చైర్ పర్సన్ అక్రమణి విజయనిర్మల, నెడ్ క్యాప్ చైర్మన్ కేకే రాజు,
కలెక్టర్ డా. ఏ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయి కాంత్ వర్మ తో కలిసి
ప్రారంభించారు. ఆసియాకు చెందిన ‘అర్బన్ క్లయిమేట్ చేంజ్ రెసిలెన్స్
ట్రస్ట్ ఫండ్’, విశాఖ`చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి కింద
డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) నిధులతో ఈ ప్రాజెక్టు వచ్చిందన్నారు.
వీసీఐసీడీపీ పథకంలో భాగంగా నాలుగు స్వైపింగ్ కమ్ సర్వీస్ స్టేషన్లను
ముడసర్లోవ, శాంతిఆశ్రమం, టౌన్ కొత్తరోడ్డు ప్రాంతాల్లో నిర్మించినట్టు
తెలిపారు. అంతేకాకుండా 180 లిథియం-అయాన్ స్మార్ట్ బ్యాటల్ని సిద్ధం
చేశామన్నారు. ఏడీపీ డీజీ మనీలా సహా జీ`20ప్రతినిధులు ఇప్పటికే ఆయా కేంద్రాల్ని
సందర్శించారని గుర్తు చేశారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం స్వైపింగ్
స్టేషన్లను, ఈ`ఆటోల్నీ ప్రారంభించామన్నారు. అంతేకాకుండా ఆటోల ప్రత్యేకతను చాటి
చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ బాణాలు శ్రీనివాసరావు, కార్పొరేటర్లు,
అదనపు కమిషనర్ డా. వై శ్రీనివాసరావు, పర్యవేక్షణ ఇంజనీర్ రవి, కృష్ణారావు
తదితరులు పాల్గొన్నారు.