గుంటూరు : ప్రతి విద్యార్థి సృజనాత్మకతను పెంచుకోవాలని, సమయాన్ని వృధా
చేయరాదని,మార్కులు కన్నా జ్ఞాన సముపార్జనకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రొఫెసర్
కే.మాలకొండయ్య హితవు పలికారు. ఆదివారం గుంటూరు స్తంభాల గురువులో బండి సాహితి
రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యస్ వి యస్ ఆర్ కె రెడ్డి బాలికల హాస్టల్
నందు విద్యార్థులను ఉద్దేశిస్తూ వ్యక్తిత్వ వికాసం పై మేథ ఐఐటీ డైరెక్టర్,
పూర్వ భౌతిక శాస్త్ర ప్రొఫెసర్ కె.మాల కొండయ్య ప్రసంగించారు. జ్ఞానవంతులైన
భారతీయులను ప్రపంచ దేశాలన్నీ స్వాగతిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో
భారత రాజ్యాంగంపై జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి
లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ రాజ్యహింసను నివారించడానికి రాజ్యాంగం
తోడ్పడుతుందన్నారు.భారత రాజ్యాంగం సజీవ పత్రమని, కాలానుగుణంగా అవసరాల మేరకు
రాజ్యాంగంలో మార్పులు చోటు చేసుకుంటున్నయని నేటికీ 104 సార్లు రాజ్యాంగ సవరణలు
చేసుకున్నామన్నారు. రాజ్యాంగాన్ని అమలు చేయవలసిన శాసన వ్యవస్థ, రాజ్యాంగ
వ్యవస్థ,పాలన వ్యవస్థలు అవినీతి మయం అయినాయి అని తెలిపారు. నేడు చట్ట సభలలో
మూడవ వంతు క్రిమినల్స్ గా నేర చరిత్ర గల వారు దర్శనమిస్తున్నారని ఆవేదన
వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బండి సాహితీ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్
బండి అశోక్ రెడ్డి,రెడ్డి హాస్టల్ సెక్రెటరీ సుధారెడ్డి,అధ్యక్షులు చల్లా
అంజిరెడ్డి,మోదుగుల పాపిరెడ్డి, ఉడుముల శ్రీనివాస్ రెడ్డి,అప్పిరెడ్డి,
సూరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాదాపు 500 మంది విద్యార్థులు ఆసక్తిగా
ప్రసంగాలని విని జాగృతులయ్యారు.