విజయవాడ : కొత్త ఆశలు, ఆకాంక్షలతో 2023 లోకి అడుగు పెడుతున్న సెంట్రల్
నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది
విష్ణు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2022 ఏడాదిలో ఎదురైన అనుభవాలను
దృష్టిలో ఉంచుకుని నూతన ఏడాదిలో మరింత పట్టుదల, కృషితో సవాళ్లను అధిగమించి
ప్రజలందరూ విజయాలను కైవసం చేసుకోవాలని తెలిపారు. నూతన లక్ష్యాలను
చేరుకోవడానికి, కొత్త అవకాశాలను అన్వేషించడానికి 2023 వ సంవత్సరం స్ఫూర్తిని
ఇవ్వాలని కోరుకున్నారు. ఈ కొత్త సంవత్సరం ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు,
ఐశ్వర్యాన్ని తీసుకువచ్చే ఏడాది కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి
జరుగుతున్న ప్రయత్నాలు ఫలించాలని అభిలషించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రతి
ఒక్క కుటుంబంలోనూ ఆనందం నింపే సంవత్సరంగా 2023 గుర్తుండిపోవాలని ఆకాంక్షిస్తూ
ప్రజలందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.