ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
డిప్యూటీ మేయర్ తో కలిసి రూ. 1.80 కోట్ల విలువైన రహదారులకు ప్రారంభోత్సవాలు
విజయవాడ : వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్ ప్రాంతమంతా నూతన
రహదారులతో కళకళలాడుతున్నాయని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్
ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 58వ డివిజన్ భరతమాత కాలనీలో రూ. కోటి 80
లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన రహదారులను నగర డిప్యూటీ మేయర్ అవుతు
శ్రీశైలజారెడ్డితో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నాడు-నేడు
ప్రదర్శన ద్వారా కాలనీలో జరిగిన ప్రగతిని స్థానికులకు వివరించారు. అనంతరం
మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలను కల్పించడంలో గత
ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. కానీ వైఎస్సార్ సీపీ
అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని డివిజన్లకు సమానంగా నిధులు కేటాయిస్తూ
అభివృద్ధి పరుస్తున్నట్లు వెల్లడించారు. శివారు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
సారిస్తూ మురుగునీటి పారుదల వ్యవస్థ, సౌకర్యవంతమైన రహదారులు, పుష్కలమైన
తాగునీరు, మెరుగైన విద్యుత్ వ్యవస్థ వంటి సకల సదుపాయాలను కల్పిస్తున్నట్లు
వివరించారు. 58వ డివిజన్ కు సంబంధించి గత మూడేళ్లలో రూ. 13.78 కోట్ల విలువైన
అభివృద్ధి పనులు చేపట్టినట్లు మల్లాది విష్ణు తెలిపారు. ఇందులో ప్రధానంగా రూ.
3.30 కోట్లతో త్రాగునీటి రిజర్వాయర్ ను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ
ప్రాంత ప్రజలకు కృష్ణా నీటిని అందించడంలో భాగంగా 3.5 కిలో మీటర్ల మేర 400 ఎం
ఎం డయా నీటి సరఫరా పంపింగ్ మెయిన్ లైన్ పనులకు ఇటీవల శంకుస్థాపన చేసుకోవడం
జరిగిందన్నారు. అలాగే తోటవారి వీధిలోని రోడ్లు ముంపునకు గురికాకుండా స్ట్రామ్
డ్రెయిన్ల నిర్మాణ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. మరోవైపు ఇందిరానాయక్
నగర్లో రూ. 80 లక్షల వ్యయంతో నిర్మించిన వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్ ను
వీలైనంత త్వరలో ప్రారంభించి ప్రజలకు సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని
తెలియజేశారు. కార్యక్రమంలో డీఈ(ఇంజనీరింగ్) గురునాథం, ఏఈ అరుణ్ కుమార్,
వైఎస్సార్ సీపీ నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, అఫ్రోజ్, బొందిలి శైలజా, తోపుల
వరలక్ష్మి, వీఎంసీ సిబ్బంది, పార్టీ శ్రేణులు, కాలనీవాసులు పాల్గొన్నారు.