హైకోర్టు
‘ఆదిపురుష్ ‘ చిత్రం విడుదలై రెండు వారాలు అవుతున్నా వివాదాలు మాత్రం ఈ
చిత్రాన్ని వదిలిపెట్టడం లేదు. ఈ సినిమా ప్రదర్శనను తక్షణం నిలిపివేయాలంటూ,
ఇందులోని కొన్ని డైలాగులు అభ్యంతరకరంగా ఉన్నాయనీ, హిందువుల మనోభావాలను దెబ్బ
తీసే విధంగా ఉన్నాయంటూ వేర్వేరుగా దాఖలైన రెండు పిటిషన్లపై మంగళవారం అలహాబాద్
హైకోర్టు విచారణ ప్రారంభించింది. ఇది రామాయణ గాథ కాదని చిత్రంలో
దర్శకనిర్మాతలు పేర్కొనడంపై జస్టిస్ రాజేశ్ సింగ్ చౌహాన్, జస్టిస్ ప్రకాశ్
సింగ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇందులో రాముడు, లక్ష్మణుడు, సీత, రావణుడు,
హనుమాన్ పాత్రలు ఉన్నట్లు చూపించారు. అయినా ఇది రామాయణ గాథ కాదని చెబుతారా?
అంటే దేశ ప్రజలకు బుర్ర లేదని భావిస్తున్నారా?’ అని ప్రశ్నించారు. ఈ.
సందర్భంగా ‘ఆదిపురుష్ ‘లోని కొన్ని డైలాగులను అనుమతించిన
సెన్సార్ బోర్డు ను కూడా తప్పుపట్టింది. ఇలాంటి వాటి వల్ల భవిష్యత్ తరాలకు ఏం
నేర్పించాలనుకుంటున్నారనీ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఈ సినిమాలో
హనుమాన్, సీత పాత్రలను మరో విధంగా చూపించారు. ఇటువంటి సన్నివేశాలను సెన్సార్
బోర్డ్ మొదట్లోనే తొలగించాల్సింది.’ అంటూ మండిపడింది. సినిమాలో అభ్యంతరకరం
ఉన్న డైలాగులను తొలగించినట్లు డిప్యూటీ సొలిసిటర్ కోర్టుకు వివరించగా కోర్టు
మరింత ఆగ్రహం వ్యక్తం చేసి సెన్సార్ బోర్డ్ ఏం చేస్తోందని ప్రశ్నించింది. మేం
వార్తల్లో చదువుతున్నాం. ప్రజలు థియేటర్ల దగ్గరకు వెళ్లి ఈ చిత్ర ప్రదర్శను
తక్షణం ఆపేయాల్సిందని డిమాండ్ చేస్తున్నారు. మా సహనాన్ని పరీక్షించకండి అని
కోర్టు పేర్కొంది. ఈ చిత్ర సంభాషణల రచయిత మనోజ్ ముంతాసీర్ శుక్రా పేరుని కూడా
పిటీషన్లో జోడించి వారంలో రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందిగా కోర్టు నేరుగా ఆయనకు
నోటీసులు జారీ చేసింది.