డిశంబరు నెలాఖరుకు వైయస్సార్ హెల్త్ క్లినిక్ల నిర్మాణం పూర్తవ్వాలి *
జగనన్నకు చెబుదాం కింద వచ్చే ఆర్థికేతర ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించండి
*2వ దశ భూ రీసర్వే చేసే 2 వేల గ్రామాల్లో సెప్టెంబర్ 30 నాటికి రాళ్ళు పాతి,
భూహక్కు పత్రాలు పంపిణీ పూర్తి చేయాలి * సెప్టెంబరు 15లోగా గ్రామ
సచివాలయాలు,రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణాలు పూర్తి చేయాలి * డిశంబరు
నెలాఖరుకు వైయస్సార్ హెల్తు క్లినిక్ల నిర్మాణం పూర్తి చేయండి * జగనన్నకు
చెబుదాం కింద వచ్చే ఆర్థికేతర ఫిర్యాదులను త్వరిత గతిన పరిష్కరించండి * జిల్లా
కలెక్టర్లతో వీడియో సమావేశంలో సిఎస్ జవహర్ రెడ్డి
విజయవాడ : రాష్ట్రంలో రెండవ దశ భూములు రీసర్వే చేపట్టిన 2వేల గ్రామాల్లో
సెప్టెంబరు 30 నాటికి రీసర్వేను పూర్తి చేసి సరిహద్దు రాళ్ళు పాతడంతో పాటు
భూహక్కు పత్రాలు పంపిణీని పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
డా.కెఎస్.జవహర్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. జగనన్న భూహక్కు,రీసర్వే,
ప్రయారిటీ భవనాలు, జగనన్నకు చెబుదాం అంశాలపై శనివారం విజయవాడలోని సిఎస్
క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లు,జాయింట్ కలెక్టర్లతో సియం ముఖ్య
సలహాదారు అజయ్ కల్లాంతో కలిసి సిఎస్ వీడియో సమావేశం నిర్వహించారు. అజెండాలో
తొలుత భూహక్కు భూముల రీసర్వే పై కలెక్టర్లతో సమీక్షిస్తూ జిల్లాల వారీ
ప్రగతిని కలెక్టర్లను అడిగి తెలుసు కున్నారు.ఈ రెండవ దశ ప్రక్రియను పూర్తి
చేసేందుకు ఒక టైం లైన్ ను పెట్టామని తెలిపారు.అదేమంటే వచ్చే జూలై 31నాటికి
విలేజ్ సర్వేయర్ లాగిన్ డేటా ఎంట్రీని ప్రక్రియను పూర్తిచేయాలని
చెప్పారు.అలాగే ఆగస్టు 31 నాటికి ఫైనల్ ఆర్ఓఆర్ ను పూర్తిచేసి పబ్లికేషన్ ను
కూడా పూర్తి చేయాలని తెలిపారు. అదే విధంగా సెప్టెంబర్ 30 నాటికి రాళ్ళు
పాతడంతో పాటు భూహక్కు పత్రాల పంపిణీని కూడా పూర్తి చేయాలని చెప్పారు.అక్టోబరు
15 నుండి రిజిస్ట్రేషన్లను ప్రారంభించాలని సిఎస్ జవహర్ రెడ్డి కలెక్టర్లను
ఆదేశించారు.ఈవిషయంలో జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ద కనపర్చి నిర్దేశించిన
గడవు ప్రకారం ఈప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం
లేకుండా నిర్దిష్ట గడువు లోగా ఈప్రక్రియను పూర్తి చేసేందుకు కలెక్టర్,జెసి
స్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. ఈసమావేశంలో
రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి , సిసిఎల్ఏ జి.సాయి ప్రసాద్ పవర్
పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జిల్లాల వారీ భూహక్కు,రెండవ దశ భూరీ సర్వే
జరుగుతున్న విధానాన్ని వివరించారు.ప్రతి రోజు దీనిపై కలెక్టర్లతో మానిటర్
చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 2లక్షల మ్యుటేషన్లు 4లక్షల సబ్ డివిజన్లు
జరిగాయని పేర్కొన్నారు.అంతేగాక ఐదారు లక్షల సరిహద్దు వివాదాలు పరిష్కారం
అయ్యాయని చెప్పారు. ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం మాట్లాడుతూ
ఎన్ఆర్ఐలకు సంబంధించిన భూమి పత్రాలను డిజిటల్ రూపంలో పంపాలని సూచించారు.దానిపై
స్పెషల్ సిఎస్ సాయి ప్రసాద్ స్పందించి భూ యజమానులైన ఎన్ఆర్ఐలకు పీడీఎఫ్
రూపంలో పంపుతామని చెప్పారు. రాష్ట్ర సర్వే మరియు సెటిల్మెంట్ శాఖ కమీషనర్
సిద్దార్థ జైన్ మాట్లాడుతూ గతంలో సర్వే రాళ్ళను 13వ నోటిఫికేషన్ అయ్యాక
పాతేవారని కాని ఇప్పుడు ఆర్ఓఆర్ పూర్తయ్యే వరకు వేచి చూడక ఏక కాలంలోనే
పాతాలని చెప్పామని ఆవిధంగానే పనులు జరుగుతున్నాయని తెలిపారు.ఇప్పటికే 700 లకు
పైగా గ్రామాల్లో ఆర్ఓఆర్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ఈసమావేశంలో సియంఓ
అదనపు కార్యదర్శి ఆర్.ముత్యాల రాజు మాట్లాడుతూ గ్రామ స్థాయిలో రిజిస్ట్రేషన్ల
ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్లకు సూచించారు.అదనపు సిసిఎల్ఏ
ఇంతియాజ్ భూహక్కు,రీసర్వే జరుగుతున్న తీరును పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా
వివరించారు.