యానాదుల పోలిటికల్ ఫోరం నిర్ణయం
విజయవాడ : సెప్టెంబర్ 9 వ తేదిన గుంటూరులోని కాసు బ్రహ్మ నంద స్టేడియంలో
యానాదుల రాజకీయ వేదిక సభను లక్ష మంది యానాదులతో నిర్వహించనున్నట్లు యానాదుల
పోలిటికల్ ఫోరం రాష్ట్ర కన్వీనర్లు కే.సీ పెంచలయ్య, యందేటి వెంకటసుబ్బయ్య
తెలిపారు. శనివారం విజయవాడలోని ప్రెస్ క్లబ్ లో యానాదుల పొలిటికల్ ఫోరం
విస్తృతస్థాయి సమావేశం జరిగింది. సమావేశానికి 8 జిల్లాల నుండి యానాది సంఘాల
నాయకులు హజరయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్ర చైర్మెన్మే కల శ్రీనివాస చక్రవర్తి
మాట్లాడుతూ యానాదులకు చట్ట సభలలో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించి, యానాదులకు
ప్రత్యేక కార్పొరేషన్, ఎం ఎల్ సీ ఇవ్వాలని కోరారు. ఈ సమా వేశంలో అధికార
ప్రతినిధి బాపట్ల బ్రహ్మయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు చేవూరు సుబ్బారావు, మహళా
నాయకులు చెందేటి దోష, బున్ను కళ్యాణి, మురదేవి, కూరు వరలక్ష్మి తదితరులు
పాల్గొన్నారు.