న్యూఢిల్లీ : రక్తంలో చక్కెర స్థాయి కట్టడికి విస్తృతంగా వాడే సెమాగ్లుటైడ్
అనే మందును అధిక మోతాదులో తీసుకుంటేనే ప్రయోజనం ఉంటుందని అమెరికాలోని నార్త్
కరోలినా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఈ వివరాలు ప్రముఖ
వైద్య పత్రిక ‘ద లాన్సెట్’లో ప్రచురితమయ్యాయి. ఎక్కువ మోతాదులో ఈ ఔషధాన్ని
తీసుకుంటే బ్లడ్ షుగర్ స్థాయిని సమర్థంగా నియంత్రించడంతోపాటు శరీర బరువును
కూడా తగ్గించుకోవచ్చని ఈ అధ్యయనం పేర్కొంది. తక్కువ మోతాదు అయిన 14
మిల్లీగ్రాములతో పోలిస్తే రోజుకోసారి 25 మిల్లీగ్రాములు లేదా 50
మిల్లీగ్రాములు తీసుకోవడం ద్వారా ఈ ఫలితాలను రాబట్టొచ్చని తెలిపింది. 50
మిల్లీగ్రాముల డోసు తీసుకున్న రోగి.. 52 వారాల్లో సరాసరిన 8 కిలోల బరువు
తగ్గినట్లు వివరించింది. తక్కువ డోసుతో పోలిస్తే ఇది రెట్టింపు ప్రయోజనాన్ని
ఇచ్చిందని తెలిపింది. సెమాగ్లుటైడ్ను 1606 మందికి వివిధ మోతాదుల్లో ఇచ్చి, ఈ
మేరకు తేల్చారు. అయితే అధిక మోతాదు వల్ల కళ్లు తిరగడం వంటి ఇబ్బందులను కొందరు
పరీక్షార్థులు ఎదుర్కొన్నట్లు చెప్పారు.