కావిటీస్ వాపు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా కూడా సైనస్ వస్తుంది.సైనస్
కారణంగా తరచుగా జలుబు వస్తుంది. తల బరువుగా ఉండటం, దగ్గు, తలనొప్పి,
గొంతునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయి.
నీరు:
సైనస్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న సమయంలో నీరు ఎక్కువగా తాగాలి. నీరు ఎక్కువగా
తాగడంతో మ్యూకస్ తగ్గుతుంది. కాఫీ, టీ, చక్కెర పానీయాలకు దూరంగా ఉండాలి.
హైడ్రేట్ ఉండటంతో గొంతు సమస్యలు దూరం అవుతాయి.
చికెన్ సూప్:
వేడిగా ఉండే పానీయాలు తాగడంతో సైనస్ సమస్య నుంచి కొంతవరకు ఉపశమనం లభిస్తుంది.
ముఖ్యంగా సూప్ తాగడంతో శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్ లు దూరం అవుతాయి.
టీ:
టీ తాగడంతో గొంతులో శ్లేష్మం చాలా వరకు తగ్గుతుంది. ముఖ్యంగా అల్లం, నిమ్మ,
పసుపు టీ తాగడంతో వ్యాధినిరోధకశక్తి మెరుగుపడుతుంది. సైనస్ నుంచి ఉపశమనం
లభిస్తుంది.
తేనె:
తేనెలో ఆరోగ్యకరమైన లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ ను
నియంత్రిస్తాయి. సైనస్ కారణంగా వచ్చే సమస్యలను దూరం చేస్తాయి.
సిట్రస్ పండ్లు:
ఈ పండ్లలో విటమిన్ సి కంటెంట్ అధికంగా ఉంటుంది. సిట్రస్ ఫ్రూట్స్ తినడంతో
వ్యాధినిరోధకశక్తి మెరుగుపడుతుంది. విటమిన్ సీ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను
కలిగి తెల్లరక్తకణాలను ఆరోగ్యంగా మార్చుతుంది.
సీఫుడ్:
సైనస్ ఇన్ఫెక్షన్ ను తగ్గించడంలో సీ ఫుడ్ సహాయపడుతుంది. ముఖ్యంగా సాల్మన్,
సార్డనస్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి వ్యాధినిరోధకశక్తిని
పెంచుతాయి.
పైనాపిల్:
పైనాపిల్లో బ్రోమలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. బ్రోమైలైన్ సైనస్ నొప్పిని, వాపును
తగ్గించడంలో సహాయపడుతుంది. పైనాపిల్ తినడంతో ఆరోగ్యం సైతం మెరుగుపడుతుంది.